Prabhas : సూపర్ హిట్ సినిమా ని మిస్ చేసుకున్న ప్రభాస్ .. అసహనంతో రగిలిపోతోన్న ఫ్యాన్స్ ! | The Telugu News

Prabhas : సూపర్ హిట్ సినిమా ని మిస్ చేసుకున్న ప్రభాస్ .. అసహనంతో రగిలిపోతోన్న ఫ్యాన్స్ !

Prabhas : ‘ బాహుబలి ‘ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి కి ముందు కేవలం తెలుగు సినిమాలలో నటించిన ప్రభాస్ ఈ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నాడు. బాహుబలితో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, సాహో సినిమాలు అంతగా హిట్ కాలేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 January 2023,8:20 pm

Prabhas : ‘ బాహుబలి ‘ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి కి ముందు కేవలం తెలుగు సినిమాలలో నటించిన ప్రభాస్ ఈ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నాడు. బాహుబలితో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, సాహో సినిమాలు అంతగా హిట్ కాలేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కె, ఆది పురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. ఇటీవల బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమాను మిస్ చేసుకున్నాడు.

గోపీచంద్ మలినేని రవితేజ తో ‘ డాన్ శీను ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుస ఫ్లాపులో ఉన్నా రవితేజ ఈ సినిమాతో సక్సెస్ను అందుకున్నాడు. అయితే ఈ సినిమా గోపీచంద్ ముందుగా ప్రభాస్ కు వినిపించారట. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించేందుకు ముందుకు వచ్చారట. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమా కథ నచ్చడంతో చేద్దామని ఓకే చెప్పాడట. కానీ ఆ వెంటనే ‘ ఏక్ నిరంజన్ ‘ సినిమా మొదలైంది. దీంతో ప్రభాస్ కాల్ షీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో గోపీచంద్ ఈ కథను హీరో గోపీచంద్ కు చెప్పారు. ఈ సినిమా నచ్చినప్పటికీ గోలీమార్, వాంటెడ్ సినిమాలు చేస్తుండడంతో ఈ సినిమా చేసే వీలు కాలేదు.

prabhas miss these hit movie

prabhas miss these hit movie

ఇక గోపీచంద్ ఈ సినిమాను కథను ఆర్ఆర్ మూవీ మేకర్స్ దగ్గరకు తీసుకువెళ్లాడంతో వారి దగ్గర రవితేజ బల్క్ కాల్ షీట్లు ఖాళీగా ఉండడంతో ఆయనకు కథ చెప్పి వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. 77 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేశారు. ఇలా తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అనుకున్న గోపీచంద్ మలినేని ప్రస్తుతం క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలను చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రెండు హిట్లు అందుకున్న గోపీచంద్ మలినేని తన తర్వాతి ప్రాజెక్టును ఏ హీరోతో తీస్తున్నారో క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ డాన్ శీను సినిమాను మిస్ చేసుకున్నందుకు ప్రభాస్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...