Home » Entertainment » Prabhas Project K Movie Update
Entertainment

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి వెంట్రుకలు లేచి డ్యాన్స్ చేసే సూపర్ న్యూస్…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 26, 2022 4:37 pm
Advertisement

Prabhas : అశ్వనీ దత్ కూతురు స్వప్న దత్ ప్రొడ్యూసర్ గా తనేంటో నిరూపించుకుంటుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో మహానటి , సీతారామం సినిమాలు నిర్మించి మంచి సక్సెస్ను అందుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘ ప్రాజెక్టు కె ‘ సినిమా మీద పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ప్రొడ్యూసర్ స్వప్న దత్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే ‘ ప్రాజెక్ట్ కె ‘ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ వస్తుందని అన్నారు. అది ఏంటో త్వరలోనే నాగ అశ్విన్ చెబుతారని అన్నారు. తప్పకుండా అందరూ ఊహించని

Advertisement

దానికంటే పెద్దగా ఉంటుంది స్వప్న దత్ అన్నారు. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్స్ దీపిక పదుకొనే, దిశాపటానిలు నటిస్తున్నారు. అలాగే అమితాబ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విఎఫ్ ఎక్స్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా 2023లో రిలీజ్ అవుతుందని చెప్పినా ఇది సాధ్యమయ్యే పని కాదని అభిమానులు అనుకుంటున్నారు. ఇక ప్రభాస్ ‘ ప్రాజెక్ట్ కె ‘ సినిమాతో పాటు సలార్, రాజా డీలక్స్ సినిమాలో నటిస్తున్నాడు.

prabhas project k movie update

Advertisement

2023 ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహానటి సినిమా తోనే తన ఏంటో నిరూపించుకున్నాడు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ప్రాజెక్ట్ కె సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనుకుంటున్నారు. ప్రాజెక్టు కె సినిమాని ఎంతో జాగ్రత్తగా, ఎక్కడ తగ్గకుండా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల విడుదల అయిన ప్రాజెక్ట్ కె సినిమా ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోవడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి