Chalapathi Rao death reason
Chalapathi Rao : సీనియర్ నటుడు చలపతిరావు ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి అలరించిన విషయం తెలిసిందే. సినీ రంగంలోకి ప్రవేశించకముందే, ప్రేమ వివాహం చేసుకున్న అతను తనకు 27 ఏళ్ల వయసు వచ్చేసరికే తన భార్య కన్నుమూసింది. అప్పటికే తనకు ముగ్గురు పిల్లలు పుట్టగా, భార్య చనిపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన వచ్చిందని, అయితే, తన పిల్లలు కళ్లెదుటే ఉండటంతో ఆ ఆలోచనను పక్కన పెట్టానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు చలపతిరావు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న
చలపతిరావు రీసెంట్‌గా హఠాన్మరణం చెందారు. డిసెంబర్ 25న తన స్వగృహంలో గుండెపోటు కారణంగా చలపతి రావు కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆయన ఇంటికే పరిమితం కాగా, హఠాత్తుగా గుండెపోటుతో మరణించటం అందరినీ కలచి వేస్తోంది. అయితే, గతంలో చోటుచేసుకున్న ఓ ప్రమాదం కారణంగా చాలా ఏళ్ల నుంచి చలపతి రావు బాధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2018 టైంలో హీరో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రంలో చలపతి రావు ముఖ్య పాత్ర పోషించారు. సినిమా షూటింగ్ సమయంలో ఓ షాట్‌లో చలపతి రావు బస్సు వెనకాల నిచ్చెన ఎక్కుతుండగా జారి
Chalapathi Rao death reason
కిందపడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం తర్వాతినుంచి చలపతిరావు ఆరోగ్యంలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌లకు కొంచెం కొంచెంగా దూరం ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. షూటింగ్‌లో జరిగిన ప్రమాదం చలపతిరావు ఆరోగ్యంపై బాగా పడిందని ఆయన మృతికి ఇది కూడా కారణం అయి ఉండొచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన ‘రారాండోయ్ వేడుక చూద్దాం’ ఈవెంట్ లో చలపతిరావు చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా, అప్పటి నుండి సినిమా ఫంక్షన్ లకు కూడా దూరమయ్యారు
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
This website uses cookies.