Home » Entertainment » Prabhas Rajamouli Clarity On Baahubali 3 Movie
Entertainment

Prabhas Baahubali 3 : బాహుబలి 3 ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే..?

Authored By
mallesh
The Telugu News | Published on: December 17, 2021, 3:40 pm
Advertisement

Prabhas Baahubali 3 : బాహుబలి మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ తేజ్‌తో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు మొదలు పెట్టారు. ఆ మూవీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీని ప్రమోషన్ పనిలో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు రాజమౌళి. వరల్డ్ వైడ్ గా సుమారు 10 భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

Prabhas Baahubali 3 : డేట్స్ కోసం వెయిటింగ్..

rajamouli clarity on bahubali 3 movie

ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్‌లో తన నెక్ట్స్ ప్రాజెక్టులపై అనౌన్స్ మెంట్ ఇవ్వాలని పలువురు కోరగా.. మొదట్లో ఆయన చెప్పలేదు. ఇక పదే పదే అడగడంతో ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ కాంబినేషన్ లో బాహుబలి 3 తీయనున్నట్టు ప్రకటించాడు. అయితే ఈ మూవీ తెరకెక్కడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్ బాబుతో రాజమౌళి ఓ మూవీ చేయనున్నారు. ప్రభాస్ చేతిలో సైతం ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఉన్నాయి.

Advertisement

మరిన్ని వీరిద్దరి డేట్స్ కుదరాలంటే ఈ మూవీకి మరో నాలుగైదు సంవత్సరాలు టైం పట్టొచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారడానికి బాహబలి మూవీయే కారణమని చెప్పొచ్చు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మరో సారి సీక్వెల్ రాబోతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఆ మూవీ లేట్ అయినప్పటికీ రాజమౌళి క్లారిటీ ఇవ్వడంతో బహుబలి 3 తప్పకుండా తెరకెక్కుతుందని అంటున్నారు సినీ అభిమానులు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి