Home » Entertainment » Prabhas Sandeep Reddy Vanga Spirit Update
Entertainment

Prabhas Spirit : ప్రభాస్ స్టామినా ఇదే.. సందీప్ రెడ్డి వంగాతో ప్యాన్ వరల్డ్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 7, 2021, 12:19 pm
Advertisement

Prabhas Spirit : ప్రభాస్ వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రభాస్ చిత్రాలను చూస్తుంటే.. ఎవ్వరికైన కళ్లు తిరగాల్సిందే. ప్యాన్ ఇండియా కాదు.. అన్నీ ప్యాన్ వరల్డ్ చిత్రాలనే పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే రాధే శ్యామ్ రెడీగా ఉంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్ సలార్ లైన్‌లో ఉంది. మధ్యలో ఓం రావత్ ఆది పురుష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే కూడా రెడీ అవుతోంది. అయితే ఇలా ప్రభాస్ సినిమాల లైన్లు చూస్తే ఎవ్వరైనా నోరెళ్లెబెట్టాల్సిందే.

Advertisement

prabhas sandeep reddy vanga spirit update

అయితే తాజాగా ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. అది కూడా ప్యాన్ వరల్డ్. .జపాన్, చైనా భాషల్లోనూ ఆ చిత్రం పట్టాలెక్కబోతోందని తెలిపారు. టీ సిరిస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా రాబోతోన్న స్పిరిట్ అనే సినిమాలో ప్రభాస్ అద్భుతైన పాత్రను పోషిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ మేరకు సందీప్ రెడ్డి వంగా వదిలిన పోస్టర్లో కొన్ని హింట్లు వదిలాడు. మొత్తానికి ఇప్పుడు ట్విట్టర్ ప్రపంచం అంతా కూడా స్పిరిట్ గురించే మాట్లాడుకుంటోంది.

Advertisement

Prabhas Spirit : ప్రభాస్ స్టామినా ఇదే.. సందీప్ రెడ్డి వంగాతో ప్యాన్ వరల్డ్

prabhas

స్పిరిట్ అంటూ వదిలిన టైటిల్ పోస్టర్లో రెండు స్టార్లు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోన్నట్టు టాక్ బయటకు వచ్చింది. అయితే రెండు స్టార్లు ఉంటే ప్రభాస్ స్థాయికి తగ్గ ఆఫీసర్ పాత్ర ఏదై ఉంటుందని మరో టాక్ బయటకు వచ్చింది. మొత్తానానికి మొదటి పోస్టర్తోనే అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఇక ఈమూవీకి సంబంధించిన మిగిలిన వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి