prabhass-adipurush-movie-is-a-hit-if-it-gets-a-lot-of-crores
Adipurush Movie : ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. జూన్ 16వ తారీకు ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్ లలో రిలీజ్ కాబోతోంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తే హిట్ అయినట్టు అనే దానిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. దాదాపు ₹500 కోట్ల మేర బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్ హక్కులతో అదే రీతిలో బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
దీంతో సినిమా ₹500 కోట్లు వసూలు చేస్తే గాని “ఆదిపురుష్” హిట్ అయినట్టు కాదని అంటున్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతి వేదికగా తెలుగు భాషకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ వేడుకలో సెకండ్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకతో మరింతగా సినిమాకి పబ్లిసిటీ రానుందని మేకర్స్ భావిస్తున్నారు. ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి హాజరు కాబోతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడం జరిగింది. ఇంకా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ మరియు పాటలు సినిమాపై అంచనాలను పెంచేయడం జరిగింది.
prabhass-adipurush-movie-is-a-hit-if-it-gets-a-lot-of-crores
పైగా ఈ సినిమా దరిదాపుల్లో మరో పెద్ద సినిమా ఏది కూడా లేదు. దీంతో సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా… లాభాలపంట గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవడంతో… మొత్తం మార్చి ఇప్పుడు లేటెస్ట్ ఎఫెక్ట్స్ జోడించి జూన్ 16న రిలీజ్ చేస్తున్నారు.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.