Adipurush Movie : ఎన్ని కోట్లు వస్తే ప్రభాస్ ఆది పురుష్ హిట్ అయినట్టు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adipurush Movie : ఎన్ని కోట్లు వస్తే ప్రభాస్ ఆది పురుష్ హిట్ అయినట్టు !

Adipurush Movie : ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. జూన్ 16వ తారీకు ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్ లలో రిలీజ్ కాబోతోంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తే హిట్ అయినట్టు అనే దానిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. దాదాపు ₹500 కోట్ల మేర బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్ హక్కులతో అదే రీతిలో బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల […]

 Authored By sekhar | The Telugu News | Updated on :6 June 2023,9:00 pm

Adipurush Movie : ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. జూన్ 16వ తారీకు ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్ లలో రిలీజ్ కాబోతోంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తే హిట్ అయినట్టు అనే దానిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. దాదాపు ₹500 కోట్ల మేర బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్ హక్కులతో అదే రీతిలో బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

దీంతో సినిమా ₹500 కోట్లు వసూలు చేస్తే గాని “ఆదిపురుష్” హిట్ అయినట్టు కాదని అంటున్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతి వేదికగా తెలుగు భాషకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ వేడుకలో సెకండ్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకతో మరింతగా సినిమాకి పబ్లిసిటీ రానుందని మేకర్స్ భావిస్తున్నారు. ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి హాజరు కాబోతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడం జరిగింది. ఇంకా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ మరియు పాటలు సినిమాపై అంచనాలను పెంచేయడం జరిగింది.

prabhass adipurush movie is a hit if it gets a lot of crores

prabhass-adipurush-movie-is-a-hit-if-it-gets-a-lot-of-crores

పైగా ఈ సినిమా దరిదాపుల్లో మరో పెద్ద సినిమా ఏది కూడా లేదు. దీంతో సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా… లాభాలపంట గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవడంతో… మొత్తం మార్చి ఇప్పుడు లేటెస్ట్ ఎఫెక్ట్స్ జోడించి జూన్ 16న రిలీజ్ చేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది