Home » Entertainment » Praga Jaiswal New Pics
Entertainment

Praga Jaiswal : ప్ర‌గ్యా జైస్వాల్ పిచ్చెక్కిస్తుందిగా… ఆ అందాల ఆర‌బోత ఏంది?

Authored By
Sam C
The Telugu News | Published on: March 27, 2022, 12:30 pm
Advertisement

Praga Jaiswal : కంచె సినిమా తర్వాత సరైన సక్సెస్‌ టేస్ట్ చూడని ప్రగ్యాజైస్వాల్‌కి అఖండ రూపంలో బిగ్ సక్సెస్‌ అందుకుంది. దీంతో అమ్మ‌డిలో జోష్ పెరిగింది. అయితే సన్‌ ఆఫ్ ఇండియా డిజాస్టర్ కావడంతో మళ్లీ డీలా పడిపోయింది. ప్రగ్యా జైస్వాల్ 1991 జనవరి 12న జన్మించింది. పూనాలోని ‘సింబయోసిస్ లా స్కూల్’లో చదువుకుంది. ముంబై మోడలింగ్ ప్రపంచంలో ఓ మెరుపు మెరిసింది. తమిళ దర్శకుడు కుమార్ .టి తన కుమారుడు సుజీవ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘విరాట్టు’ అనే చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమాలోనే ప్రగ్య అందం తొలిసారి వెండితెరపై మెరిసింది. ఇదే సినిమా తెలుగులో ‘డేగ’ పేరుతో అనువాదమయింది. అప్పట్లో ఎవరూ ఆ సినిమాను పట్టించుకోలేదు. తరువాత హిందీలో ‘టిటూ ఎమ్.బి.ఏ.’లో నటించింది. ఆ సినిమా సైతం ఆకట్టుకోలేకపోయింది.
ప్ర‌గ్యా అందాల అరాచ‌కం..

Advertisement

తెలుగులో ప్రగ్య నటించిన తొలి చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’. ఈ సినిమా బోల్తా కొట్టింది. ఇక క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘కంచె’ నటిగా ప్రగ్యకు మంచి పేరు సంపాదించి పెట్టింది. అంతే తప్ప, పెద్దగా ఒరిగిందేమీ లేదు. నాగార్జునతో రాఘవేంద్రరావు రూపొందించిన ‘ఓం నమో వేంకటేశాయ’లో భవానీ పాత్రలో ప్రగ్య కనిపించింది. మంచు మనోజ్ ‘గుంటూరోడు’లోనూ ప్రగ్యనే నాయిక. కృష్ణవంశీ తెరకెక్కించిన ‘నక్షత్రం’లో కిరణ్‌ రెడ్డి ఐపీయస్ పాత్రలో విజృంభించి నటించింది ప్రగ్య. కానీ, ఏం లాభం ఆ సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది. చాలా చిత్రాల‌లో న‌టించిన కూడా ఈ అమ్మ‌డికి పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొంద‌లేక‌పోయిది.

Praga Jaiswal new pics

Advertisement

గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ‘ అఖండ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. తాజాగా ప్యాంట్ లేకుండా నానా హంగామా సృష్టించింది.ఈ పిక్స్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి