Home » Entertainment » Pragatha Stunning Workouts
Entertainment

Pragathi : ప్ర‌గ‌తి వ‌ర్క‌వుట్స్ మాములుగా లేవుగా.. ఇది అరాచ‌క‌మే.. వీడియో !

Authored By
Sam C
The Telugu News | Published on: April 9, 2022, 11:00 am
Advertisement

Pragathi : ప్ర‌గతి.. ఒక‌ప్పుడు పెద్దగా ఎవ‌రికి తెలిసేది కాదు. కాని ఇటీవ‌ల ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో నానా రచ్చ చేస్తూ హంగామా సృష్టిస్తుంది. 44 ఏళ్ల ప్రగతి సోషల్ మీడియాలో సంచలనాలు చేస్తున్నారు. ఆమె డాన్స్, ఫిట్నెస్ వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో తల్లి, అత్త, వదిన వంటి పాత్రలు చేసే ప్రగతి ఇమేజ్ పూర్తిగా మార్చేసింది సోషల్ మీడియా. ప్రగతి చేసే పాత్రల రీత్యా.. ఆమె చాలా నెమ్మదస్తురాలని జనాలు అనుకున్నారు. కానీ ప్రగతి సూపర్ షార్ప్ అని ఆమె వీడియోల ద్వారా తెలిసింది. క‌రోనా కాలం నుండి ప్రగతి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయారు. ట్రెండింగ్ సాంగ్స్ కి డాన్స్ వీడియోలు చేయడం ఆమెకు అలవాటుగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ప్రగతి జోరు చూసిన నెటిజెన్స్ మొదట్లో షాక్ కి గురయ్యారు.

Advertisement

ప్రగతిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయారు. అలాగే ప్రగతి తన ఫిట్నెస్ వీడియోలు కూడా షేర్ చేయడం ప్రారంభించారు. సదరు వీడియోలలో ప్రగతి డ్రెస్ సెన్స్ ట్రోల్ల్స్ కి దారి తీసింది.ఈ వయసులో ఇంకా ఏం సాధించాలని ఆంటీ? హీరోయిన్ అవుదామనుకుంటున్నావా?.. లాంటి నెగిటివ్ కామెంట్స్ ప్రగతికి ఎదురయ్యేవి. సదరు కామెంట్స్ కి ప్రగతి రియాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తే.. మీకు ఇబ్బంది ఏమిటీ? నేను చేసే డాన్స్ వీడియోలు, ధరించే డ్రెస్ నా వ్యక్తిగతం, మీలాంటి వారి నెగిటివ్ కామెంట్స్ నేను పట్టించుకోనంటూ, ట్రోల్ చేసేవారి నోళ్లు మూపించే ప్రయత్నం చేశారు.ఈ అమ్మ‌డు తాజాగా జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

pragatha stunning workouts in Video

Advertisement

Pragathi : ప్ర‌గ‌తినా, మ‌జాకానా?

ప్ర‌గ‌తి వ‌ర్క‌వుట్స్ చూసి అంద‌రు నోరెళ్ల‌పెడుతున్నారు. బాబోయ్ ప్ర‌గతి ఫిట్‌నెస్ పీక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌గ‌తి వ‌ర్క‌వుట్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతుంది. అయితే జిమ్ వీడియోలతో పిచ్చిలేపే ప్రగతి ఇటీవ‌ల స్టైలిష్ గా కనిపించి మెప్పించింది. గ్రీన్ కలర్ సింగిల్ పీస్ స్లీవ్ లెస్ టాప్ లో హాట్ గా కనిపించి ఫిదా చేసింది. పొడవైన జుట్టును పైకి ముడి పెట్టి, నల్ల కళ్ళద్దాలతో అదరగొట్టేసింది. మరి ముఖ్యంగా అమ్మడి జబ్బపై ఉన్న టాటూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. వావ్ .. ప్రగతి ఆంటీ .. హీరోయిన్ కు మీరు ఏ మాత్రం తక్కువ కాదు అని కొందరు.. ఎన్ని ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయడం ఎలాగో ప్రగతి ని చూసి నేర్చుకోవాలని మరికొందరు కామెంట్స్ చేశారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి