Home » Entertainment » Pragathi Contestant For Big Boss 6 Telugu Ott Season
Entertainment

Pragathi : బిగ్ బాస్ 6 కంటెస్టెంట్‌గా ప్రగతి..ఇక అక్కడ రచ్చ రచ్చే..!

Authored By
mallesh
The Telugu News | Published on: January 9, 2022, 8:55 am
Advertisement

Pragathi : బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇటీవల ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నెక్స్ట్ సీజన్ అనగా సీజన్ సిక్స్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ షో ఓటీటీ వర్షన్‌గా వెరీ డిఫరెంట్‌గా ఉండబోతుంది. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఇక 24 గంటలు ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ షోకు కూడా నాగార్జుననే హోస్ట్ కాగా, ఇందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో బోలెడన్ని వార్తలొస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం..సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతి ఈ సారి బిగ్ బాస్ 6లో కంటెస్టెంట్‌గా జాయిన్ కాబోతుందట.

Advertisement

గత సీజన్స్ కంటే భిన్నంగా ఈ సారి వెరీ డిఫరెంట్ పర్సన్స్ ను కంటెస్టెంట్స్ గా నిర్వాహకులు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఉప్పల్ బాలు, సిరి హన్మంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, షణ్ముక్ జస్వంత్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన కంటెస్టెంట్స్ గా సెలక్ట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా ఈ సారి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నదని వార్తలొస్తున్నాయి.‘బి గ్ బాస్’ షో నిర్వాహకులు ఇప్పటికే ప్రగతిని కలిశారట.షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేషన్‌కుగాను భారీ రెమ్యునరేషన్ ఇస్తామని కమిట్ మెంట్ కూడా ఇచ్చారట.

pragathi contestant for big boss 6 telugu ott season

Advertisement

Pragathi : కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతుందా.. ప్రగతికి భారీ రెమ్యునరేషన్..?

అలా బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ ఓటీటీ‌కి కంటెస్టెంట్ గా రాబోతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి.. ఈ వార్తలో నిజముందో.. గతంలో సీనియర్ ఆర్టిస్టులు, హేమ, కరాటే కల్యాణి, ఉమా దేవిలు కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేశారు. ప్రగతి డ్యాన్స్ చేసిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. ఇకపోతే సోషల్ మీడియాలో ప్రగతి వెరీ యాక్టివ్ పర్సన్‌గా ఉంటుంటారు. పలు విషయాలపై అప్పుడప్పుడు స్పందిస్తుంటారు కూడా. ప్రగతి బిగ్ బాస్‌కు వెళ్తే అక్కడ తన డ్యాన్స్‌తో రచ్చ రచ్చ చేస్తుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి