pragathi Direct attack on trollers
Pragathi : నటి ప్రగతిని వెండితెరపై చూస్తే ఎంత సంప్రదాయబద్ధంగా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్క, తల్లి, అత్త ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించి మెప్పించిన ప్రగతి ఇటీవల తెగ అందాలు ఆరబోస్తూ జిమ్‌లో రచ్చ చేస్తుంది. అంతేకాదు డ్యాన్స్ లతోను రెచ్చిపోతుంది. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన ఈ నటి ఇటీవల కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. లేటు వయసులో ఘాటు పోజులతో సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది.ఈ క్రమంలోనే ప్రగతి ట్రోలింగ్ జరిగిన సందర్భాలు కూడా బోలెడు. నాలుగు పదులు దాటుతున్నా కూడా ఆమె ఎనర్జీ చూసి కొందరు ఫిదా అవుతుంటే..
ఈ వయసులో ఇంకా ఎందుకింత దూకుడు ఏం ఆశించి అని అనేవారు కూడా ఉన్నారు. ప్రగతి ఆంటి టాలీవుడ్ లో తన దైన ముద్ర వేసుకుంది. యంగ్ హీరోయిన్స్ కూడా చేయలేని…విధంగా పర్ ఫామెన్స్ లతో.. కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. అంతలా పవర్ ఫుల్ వర్క్ అవుట్ వీడియోలు చేస్తుంది. అంతేనా, ఇన్స్టా లో తనకు నచ్చిన రీల్స్ కూడా చేస్తూ..ట్రెండీ వేర్ లో డ్రెస్లు వేస్తుంటుంది. దీంతో అలాంటి వారందరికీ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది ప్రగతి. ట్రోలర్స్ పై డైరెక్ట్ అటాక్ చేసింది. తాజాగా ఓ రీల్ వీడియో షేర్ చేస్తూ తనను విమర్శించే వాళ్లపై పంజా విసిరింది. నువ్వేమైనా యంగ్ అమ్మాయివి అనుకుంటున్నావా?
pragathi Direct attack on trollers
అనే వారందరిపై సెటైరికల్ కామెంట్ చేసింది ప్రగతి. ”నేను ఏం యంగ్‌గా కనిపించేందుకు ట్రై చేయడం లేదు దేశోద్దారకులారా… నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా జీవిస్తున్నా..అంతే, నా లైఫ్‌ను ప్రేమిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. దీంతో ట్రోలర్స్ కి ఘాటు కౌంటర్ ఇచ్చిన్నట్లైంది. కాని ప్రగతి డెడికేషన్‌ని తప్పక మెచ్చుకోవల్సిందే. జిమ్ముల్లో కుస్తీ పడుతూ తన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడం ప్రగతి నైజం. ఏ మాత్రం సమయం దొరికినా జిమ్ములోనే గడిపేస్తుంది ప్రగతి. అలా ఇప్పటికే ప్రగతి జిమ్ ఫొటోస్ ఎన్నో నెట్టింట వైరల్ అయ్యాయి. అలా ప్రగతి పేరు ఎప్పుడూ జనం నోళ్ళలో నానుతూనే ఉంటుంది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.