Pragathi
Pragathi : టాలీవుడ్ ఆంటీ, మదర్ క్యారెక్టర్స్‌కే పరిమితమైన నటి ప్రగతి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ చెలరేగిపోతోంది. కరోనా సమయం నుండి చాలా యాక్టివ్ అయింది. తన ఫిట్‌నెస్‌ని కాపాడుకునేందుకు చేసే వర్కవుట్ వీడియో లను షేర్ చేస్తూ అందర్ని చిల్ చేస్తోంది. అయితే జిమ్, ఎక్స్‌ర్‌సైజ్ వీడియోలు చాలా షేర్ చేసిన ప్రగతి.. అప్పుడప్పుడు డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫ్రెండ్, డైరెక్టర్ నందినీ రెడ్డికి స్పెషల్ విషెస్ తెలియజేసింది.
రకక్షకునికి హ్యాపీ బర్త్ డే.. “జీవితం మనం చూస్తున్నంత క్లిష్టంగా లేదు.. దానిని ఎంత సింపుల్ గా ఉంచుతాం!! సాధారణ విషయాలను ప్రేమించండి.. పెద్ద విషయాలు ఎలాగైనా మీకు దారి చూపుతాయి!! ఇప్పుడిప్పుడు టైం స్టార్ట్ అయింది. ముందున్నవి విజయాలు, వేడుకలు మాత్రమే. చాలా సినిమాలతో పాటు జ్ఞపాకలు ఉన్నయి నందు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఆమెతో దిగిన క్యూట్ పిక్స్ షేర్ చేసింది ప్రగతి. గ్లామర్ వరల్డ్ లోనూ మెగా ఫోన్ పట్టి మగాళ్ళకు దీటుగా రాణించగలరని కొందరు నిరూపించారు. అలాంటి వారిలో దర్శకురాలు, రచయిత నందినీ రెడ్డి కూడా చోటు సంపాదించారు.
Pragathi
వేళ్ళ మీద లెక్కపెట్టదగ్గ చిత్రాలే తీసినా, నందినీరెడ్డి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. నవతరం ప్రేక్షకుల నాడిని పట్టి, అందుకు తగ్గ రీతిలో సినిమాలు రూపొందించడంలో తనదైన బాణీ పలికిస్తున్నారామె. మొదటి నుంచీ సినిమాలపట్ల ఆసక్తి పెంచుకున్న నందిని 16 ఏళ్ళ వయసులోనే నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజును కలిశారు. ఆయన తెరకెక్కించిన ‘లిటిల్ సోల్జర్స్’కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. సినిమాటోగ్రాఫర్-డైరెక్టర్ రసూల్ ఆమెలోని ఉత్సాహం చూసి, కృష్ణవంశీకి పరిచయం చేయగా, మొదట్లో ఆయన తన వద్ద ఖాళీ లేదన్నారు. తరువాత రమ్యకృష్ణ కూడా నందినిలోని చలాకీతనం చూసి ముచ్చటపడి, కృష్ణవంశీకి సిఫార్స్ చేశారు. అలా వంశీ దగ్గర కొంతకాలం అసిస్టెంట్ గా పనిచేశారామె. సురేశ్ ప్రొడక్షన్స్ లోనూ కొన్ని సినిమాలకు అసోసియేట్ గా ఉన్నారామె. అలా మొదలైంది చిత్రంతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నందిని రెడ్డి.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.