Home » Entertainment » Pragya Jaiswal Photos In Viral
Entertainment

Pragya Jaiswal : న‌లుపు రంగు డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ అందం రెట్టింపు అయిందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 14, 2022, 10:00 pm
Advertisement

Pragya Jaiswal : ప్ర‌తిభ‌తో రాణిస్తున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో ప్ర‌గ్యా జైస్వాల్ ఒక‌రు. తెలుగులో ప్రగ్య నటించిన తొలి స్ట్రెయిట్ మూవీ ‘మిర్చిలాంటి కుర్రాడు’. ఈ సినిమా త‌ర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘కంచె’ నటిగా ప్రగ్యకు మంచి పేరు సంపాదించి పెట్టింది. నాగార్జునతో రాఘవేంద్రరావు రూపొందించిన ‘ఓం నమో వేంకటేశాయ’లో భవానీ పాత్రలో ప్రగ్య కనిపించింది. మంచు మనోజ్ ‘గుంటూరోడు’లోనూ ప్రగ్యనే నాయిక. కృష్ణవంశీ తెరకెక్కించిన ‘నక్షత్రం’లో కిరణ్‌ రెడ్డి ఐపీయస్ పాత్రలో విజృంభించి నటించింది ప్రగ్య. మంచి పాత్రలే పలకరించినా, నటిగా మంచి మార్కులే సంపాదించినా, చిత్రసీమకు కావలసిన ఓ గ్రాండ్ సక్సెస్ ప్రగ్య దరి చేరలేదు.

Advertisement

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన ఓ నాయికగా ‘జయ జానకీ నాయక’లో నటించింది ప్రగ్య. ఇందులో ప్రధాన నాయిక రకుల్ ప్రీత్ సింగ్. అయినా, తనకున్న పరిధిలో తాను నటించి మంచి మార్కులు కొట్టేసింది ప్రగ్య. మంచు విష్ణు సరసన ‘ఆచారి అమెరికా యాత్ర’లోనూ ప్రగ్య మెరిసింది. పేరు లభించినా, పరాజయాలు మాత్రం ప్రగ్యను పలకరిస్తూనే వచ్చాయి. అలాంటి ప్రగ్యను దాదాపు మూడేళ్ళ పాటు ఏ తెలుగు దర్శకుడు కానీ, నిర్మాత కానీ పలకరించలేదు. ప్రగ్యను బోయపాటి శ్రీను ‘అఖండ’లో బాలకృష్ణ సరసన నాయికగా ఎంపిక చేయగానే పలు వ్యాఖ్యలు వినిపించాయి.

Pragya Jaiswal photos in Viral

Advertisement

Pragya Jaiswal : ఆహా.. ఏమి అందం..!

అఖండ సినిమాలో ఈ అమ్మ‌డు అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. అఖండ విజ‌యం త‌ర్వాత ప్ర‌గ్యా జైస్వాల్ త‌గ్గ‌ట్లేదుగా.. అదర‌గొట్టే అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో రెచ్చిపోయే అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ప్రస్తుతం ప్రాగ్యా జైస్వాల్ కేరీర్ దూసుకుపోతోందని చెప్పాలి. అఖండ మూవీ భారీ విజయంతో అప్ కమింగ్ ఫిల్మ్స్ లో ప్రాగ్యా జైస్వాల్ నే తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నట్టుు తెలుస్తోంది. ఇప్పటికే అఖండ తర్వాత.. ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీలో నటించింది ప్రగ్యా. అటు హిందీలోనూ సల్లూ బాయితో కలిసి ‘మే ఛలా’ మ్యూజిక్ వీడియోలో నటించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి