pranitha shares baby bump pics
Pranitha : బాపు బొమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రణీత. ఈ అమ్మడు ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని, తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలుపుతూ ఏకంగా స్కానింగ్ రిపోర్ట్ చూపించింది. తన భర్త తనను ఎత్తుకున్న ఫొటోలను ఇన్స్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఈ విషయాన్ని రివీల్ చేసింది ప్రణీత. ఈ ఫొటోల్లో ప్రణీత, ఆమె భర్త ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనిపించారు. ఆమె తన పొట్టను అద్దంలో చూసుకున్న అందమైన చిత్రాన్ని కూడా షేర్ చేశారు. “మీరు గర్భవతి అని తెలుసుకున్నప్పుడు మీరు చేసే మొదటి పని మీరు ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి ఉన్నప్పుడు మీ పొట్టను తనిఖీ చేయడం. అంతేకదా అని పేర్కొంది.
ప్రేమ వివాహం చేసుకున్న ప్రణీత.. తన ప్రేమ, పెళ్లి వ్యవహారాన్ని రహస్యంగా ఉంచింది. ఏ ఒక్కరికీ తెలియకుండా సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. చివరకు ఫోటోలు బయటకు రావడం అసలు విషయం తెలుసుకున్నారు జనం. ఆ తర్వాత ప్రణీత ఓపెన్ అయింది. కుటుంబ సభ్యుల సమక్షంలో నితిన్ రాజును పెళ్లి చేసుకున్నానని వెల్లడించింది. గతేడాది ప్రణీత- నితిన్ రాజుల వివాహాం జరగ్గా ఈ ఏడాది పేరెంట్స్ కాబోతున్నారు . అయితే తన భర్త 34వ పుట్టినరోజు సందర్భంగా పైనున్న దేవతలు మాకు ఓ బహుమతి ఇవ్వబోతోన్నారు అంటూ తన ప్రెగ్నెన్సీ మ్యాటర్ చెప్పింది ప్రణీత. తాను టెస్ట్ చేసుకున్నానని, పాజిటివ్ వచ్చిందని తెలిపింది. ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెప్పారు.
pranitha shares baby bump pics
ఇక ప్రగ్నెంట్ కన్‌ఫాం అయినప్పటి నుండి ప్రణీత ఫొటో షూట్స్‌తో రచ్చ చేస్తుంది. బేబి బంప్ చూపిస్తూ ఈ అమ్మడు దిగుతున్న పిక్స్ నెటిజన్స్ మతులు పోగొడుతున్నాయి.తాజాగా బికినీలో బేబి బంప్ చూపిస్తూ ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా చేసింది ప్రణీత. ప్రస్తుతం ప్రణీత క్యూట్ పిక్స్ నెటింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత తనదైన హోమ్లీ లుక్స్‌తో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. పలు భాషల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.