Home » Entertainment » Prashanth Neel Relative To The Naresh Wife
Entertainment

Prashanth Neel : ప్రశాంత్ నీల్ కి నరేష్ మూడో భార్య చుట్టమా ?

Authored By
Sam C
The Telugu News | Published on: July 3, 2022, 5:00 pm
Advertisement

Prashanth Neel : గ‌త కొద్ది రోజులుగా న‌రేష్ ప‌విత్ర‌,న‌రేష్ మూడో భార్య‌కు సంబంధించిన వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. నటుడు నరేష్ కేంద్రంగా మూడు ముక్కలాట నడుస్తుంది. అయితే ప‌విత్ర‌తో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న న‌రేష్‌పై తెగ ఫైర్ అవుతుంది ర‌మ్య ర‌ఘుప‌తి. మ‌రోవైపు మూడవ భార్య రమ్య రఘుపతి పై తీవ్ర ఆరోపణలు చేశారు న‌రేష్‌. ర‌మ్య‌ సరిగా ఉంటే నరేష్ తో కలిసి ఉండేది. ఆమె ప్రవర్తన సరిగా లేని కారణంగానే వదిలేశారంటూ పవిత్ర లోకేష్ తెలియజేశారు. నరేష్ సైతం రమ్య తన వద్ద డబ్బులు తీసుకున్నట్లు , ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. ఇంకా ఘోరమైన వ్యక్తిగత విషయాలు బయటపెట్టడం జరిగింది.

Advertisement

రమ్య ర‌ఘుప‌తి గత కొద్ది రోజుల నుండి తెగ హాట్ టాపిక్‌గా మారుతుండ‌గా, ఆమెకు సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. నిజానికి రమ్యది కూడా ఉన్నత కుటుంబమే. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తెనే ఈ రమ్య రఘుపతి. ఆమెతో నరేశ్ కు 2010లో పెళ్లయింది. ఎనిమిదేళ్ల కాపురం తర్వాత స్పర్థలు రావడంతో కొంతకాలంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.సీనియ‌ర్ నాయ‌కుడు ర‌ఘువీరారెడ్డి , ర‌మ్య తండ్రి వ‌రుస‌కు సోద‌రులు. కేజీఎఫ్‌ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కూడా నరేష్ మూడో భార్య రమ్యకు రిలేటివ్ అవుతాడు. ర‌మ్యకు వ‌రుస‌కు ప్రశాంత్ నీల్ అన్న అవుతాడని సమాచారం.

Prashanth Neel relative to the naresh wife

Advertisement

Prashanth Neel : పెద్ద ఫ్యామిలీనే..

రమ్య తండ్రితో పాటు ప్రశాంత్ నీల్ కుటుంబం ఎప్పుడో బెంగుళూరులో స్థిరపడ్డారు. ఈ కుటుంబానికి సినిమా నేపథ్యం ఉంది. ఈ క్రమంలో రమ్య, నరేష్ మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా పెళ్ళికి దారితీయడం జరిగింది. కొన్నాళ్ళు కలిసున్న ఈ జంట మనస్పర్థలతో విడిపోయారు. ఓ ఏడాది క్రితం రమ్య రఘుపతి ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొన్నారు. కృష్ణ కుటుంబ సభ్యురాలిగా ఆమె పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారని కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం పెద్ద న్యూస్ కావడంతో నరేష్ మీడియాకు వివరణ ఇచ్చారు. రమ్య ఆర్ధిక నేరాలకు నాకు సంబంధం లేదు. ఆమెతో విడిపోయి చాలా కాలం అవుతుందని వివరణ ఇచ్చారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి