Priyamani say about her marriage
Priyamani : టాలీవుడ్ లో జగపతిబాబు నటించిన ‘ పెళ్లయిన కొత్తలో ‘ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది అందాల నటి ప్రియమణి. తొలి సినిమాతో అంతగా గుర్తింపు రాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ యమదొంగ ‘ సినిమాతో అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాని రాజమౌళి దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ప్రియమణి కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. తమిళంలో పరుత్తివీరన్ సినిమాలో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది.
ప్రస్తుత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా పలు సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ నటనపరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు క్రేజ్ బాగానే ఉంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో మనోజ్ వాజ్పేయి భార్య పాత్రలో ప్రియమణి నటించి మెప్పించింది. తెలుగులో పలు బుల్లితెర షోలను జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈటీవీలో పాపులర్ డాన్స్ షో డీ షోకి ప్రియమణి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే కెరీర్ ఆరంభంలో ప్రియమణి ట్రోల్స్ ఎదుర్కొన్నారు. తన కలర్ శరీరంపై ఇప్పటికీ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. నా జీవితం నా ఇష్టం నేను ట్రోల్స్ పట్టించుకోను.
Priyamani say about her marriage
నేను ఎవరితో జీవించాలనేది నా వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చారు. ముస్తఫా రాజ్ ని వివాహం చేసుకోవడంతో ఆమె ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇక ప్రియమణి ఆరేళ్ల కిందట బిజినెస్ మాన్ ముస్తఫా రాజ్ ను వివాహం చేసుకుంది. ఆయనకు ఇది రెండవ వివాహం. ఇప్పటికీ మొదటి భార్యతో వివాదం నడుస్తోంది. ప్రియమణితో ఆయన వివాహం చెల్లదని భార్య ఆరోపిస్తుంది. ముస్తఫా రాజ్ ఎక్కువగా అమెరికాలో ఉంటారు. ఇండియాలో ప్రియమణి ప్రొఫెషన్తో బిజీగా ఉంటుంది. ఇక పెళ్లి అయి ఆరేళ్లవుతున్న ఇంతవరకు పిల్లల్ని కనలేదు. ఇక ఇటీవలే కస్టడీ సినిమాలో ప్రియమణి కీలకపాత్ర పోషించింది. అలాగే షారుక్ ఖాన్ నయనతార నటిస్తున్న జవాన్ సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.