Priyanka Singh Fall In Bigg Boss Kings Vs Queen Event
Priyanka Singh : బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక సింగ్. తన చేష్టలతో అందరినీ కొన్నిసార్లు విసిగించేసింది ప్రియాంక. మానస్ చుట్టూరా చేరి అతడిని టార్చర్ పెట్టేసినట్టు అనిపించింది. కొన్ని సార్లు యాంకర్ రవి చెప్పినందు వల్లే మానస్ చుట్టూ తిరిగినట్టు అనిపించింది. ఫ్రెండ్‌గా మానస్ చూస్తుంటే.. ప్రియాంక మాత్రం ఇంకా ఏదో ఆశించినట్టు అనిపించింది. మొత్తానికి మానస్ ప్రియాంక ట్రాక్ మాత్రం జనాలను ఎంటర్టైన్ చేసింది.. మధ్యలో చికాకు పెట్టించింది. అలా మొత్తానికి ప్రియాంక మాత్రం మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
బయటకు వచ్చాక కూడా మానస్, సన్నీ, జెస్సీ, శ్రీరామచంద్ర, రవి, ప్రియా వంటి వారితో కలిసి బాగానే సందడి చేస్తోంది. అయితే ఇప్పుడు స్టార్ మా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఈవెంట్ చేసింది. ఇందులో భాగంగా ఐదో సీజన్ కంటెస్టెంట్లు ఎక్కువగా వచ్చారు. ఇందులో సన్నీ, ప్రియాంక సింగ్, సిరి వంటి వారు పర్ఫామెన్స్‌లతో రెచ్చిపోయారు. ఇక టాస్కులు ఆడే సమయంలో ప్రియాంకకు ఒక్కసారిగా ప్రమాదం ఏర్పడింది. సడెన్‌గా కింద పడిపోయింది. దీంతో ఆమెకు ఏమై ఉంటుందా? అని అందరూ కంగారు పడ్డారు.
Priyanka Singh Fall In Bigg Boss Kings Vs Queen Event
ఆమె మొహానికి గాయమైనట్టు అనిపించింది. అయితే ఇంతలో సన్నీ వచ్చి ఓ కౌంటర్ వేశాడు. నీ నడుముకు ఏమీ కాలేదు కదా? అని కౌంటర్ వేయడంతో.. అందరూ నవ్వేశారు. ప్రియాంక సైతం ఒక్కసారిగా ఫక్కున నవ్వేసింది. మొత్తానికి ఈ ఈవెంట్‌లో ప్రియాంక రెచ్చిపోయింది. అవినాష్‌తో కలిసి రొమాన్స్‌లో దుమ్ములేపేసింది. అవినాష్ రెచ్చగొట్టడంతో ప్రియాంక రెచ్చిపోయింది. నువ్ నిజంగా క్వీన్ అయితే.. నీకు దమ్ముంటే.. నన్ను హగ్ చేసుకో అని అవినాష్ సవాల్ విసురుతాడు.
అవినాష్ చాలెంజ్‌కు ప్రియాంక రెచ్చిపోతుంది. అవినాష్‌ను తన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.అలా మొత్తానికి అవినాష్, ప్రియాంకలు స్టేజ్ మీదే రెచ్చిపోయారు. ఈ ప్రోమోలో టీఆర్పీ స్టంట్ల కోసం మంచి డ్రామా ఆడినట్టు కనిపిస్తోంది. చివర్లో గొడవ కూడా పడ్డారు.
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
This website uses cookies.