
Chittibabu : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత చిట్టిబాబు..!
Chittibabu : జనవరి 18న నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా తారక రామారావు సమాధి వద్దకు చేరుకొని ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇకపోతే ఎన్టీఆర్ తన తాతయ్యకు నివాళులు అర్పించడానికి రాబోతున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడ ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడమే కాకుండా ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించి వెళ్లిన కాసేపటికి బాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. వెళ్ళగానే అక్కడ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అన్నింటిని తీసేయమని తన అనుచరులతో చెప్పడంతో ఆ విషయం కాస్త వివాదంగా మారింది.
ఇక ఈ విషయంపై తాజాగా నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఘాటు వద్ద ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని బాలయ్య చెప్పిన దాంట్లో తప్పు లేదని అన్నారు. బాలయ్య కనుక అలా చెప్పారు నేను కనుక ఉంటే నా రియాక్షన్ మరోలా ఉండేదని ఆయన తెలిపారు. ఎవరైనా కానీ చనిపోయిన వారి దగ్గర బ్రతికున్న వారి ఫోటోలను పెడతారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే వారికి ఏమాత్రం పని పాట లేదని, అందుకే చనిపోయిన వారి ఘాటు వద్ద బ్రతుకున్న వారి ఫోటోలను పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం ఉంటే సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలను ఘాటు వద్ద పెట్టాలి కానీ బ్రతికున్న వారి ఫోటోలు పెట్టడం ఏంటని అన్నారు.
రాజకీయాల పరంగా ఎన్టీఆర్ ను అణచివేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కూడా చిట్టిబాబు స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలి అంటే ఆయనను ఎవరు అడ్డుకోరు. కానీ ఆయనకు సినిమాలంటేనే ఆసక్తి. తన చుట్టూ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లకు మంచి సినిమాలు ఇవ్వాలన్న తపనతో సినిమాలలో నటిస్తున్నారని, సినిమాలు తన జీవితం అనుకున్నాడు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అభిమానులకు న్యాయం చేయాలని గెటప్ లు మారుస్తూ నేడు గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తన జీవితం సినిమాలు అనుకున్నాడు కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అంతే తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదని చిట్టిబాబు అన్నారు. ఆయన రాజకీయాలలోకి వస్తే ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని చిట్టిబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.