
Dil Raju , producer Dil raju give big party
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో బెస్ట్ బిజినెస్ మాన్ ఎవరైనా ఉన్నారంటే అదే దిల్ రాజ్ మాత్రమే అని చెబుతుంటారు. ఆయన చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. దిల్ రాజ్ కేవలం పెద్ద హీరోలతోనే కాదు చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే దిల్ రాజ్ త్వరలోనే టాలీవుడ్ స్టార్స్ అందరికీ పెద్ద పార్టీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో ఆయన కొంతకాలం కిందట రెండో పెళ్లి చేసుకున్నారు. తేజస్విని అనే యువతిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. గతేడాది వీళ్లకు ఒక కుమారుడు జన్మించాడు.
అయితే ఇప్పుడు ఆ బాబు మొదటి పుట్టినరోజు గ్రాండ్గా చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ లోని స్టార్స్ అందరిని పిలవాలని ఆయన అనుకుంటున్నారట. మామూలుగానే ప్రముఖుల ఇంట్లో ఫంక్షన్లు అంటే పెద్ద ఎత్తున స్టార్స్ వచ్చి సందడి చేస్తుంటారు. అలాంటిది స్టార్ ప్రొడ్యూసర్ పిలిచాడు కాబట్టి ఎక్కువమంది వచ్చే అవకాశం ఉంది. ఈ ఫంక్షన్ కి అందరూ స్టార్స్ ఒకే చోట కనిపించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ ఏడాది దిల్ రాజ్ బలగం వంటి చిన్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
Dil Raju , producer Dil raju give big party
అలాగే విజయ్ దళపతి నటించిన ‘ వారసుడు ‘ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా కూడా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఇక రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాని కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో మెగా అభిమానులు దిల్ రాజు పై కాస్త సీరియస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో దిల్ రాజును రామ్ చరణ్ కొత్త మూవీ గురించి అడుగుతున్నారు. మరీ దిల్ రాజ్ ఈ సినిమాపై అప్డేట్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.