
Punch Prasad Satires on His Kidney Problem in Etv Rakhi Special Event
Punch Prasad : బుల్లితెరపై పంచ్ ప్రసాద్ చేసే కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పంచ్ ప్రసాద్ తన పేరుకు తగ్గట్టే పంచ్‌లను వేస్తుంటాడు. తన కిడ్నీ సమస్యల గురించి అందరికీ తెలిసిందే. కిడ్నీలు పాడవ్వడం, ఆపరేషన్ బెడ్డుపై ఉండటం, తన భార్యే కిడ్నీ దానం చేసేందుకు రెడీ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పంచ్ ప్రసాద్ బుల్లితెరపై తెగ సందడి చేస్తున్నాడు. అన్ని షోల్లోనూ ఆయనే కనిపిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ ఆదాయం గురించి ఈ మధ్యే హైపర్ ఆది బయటపెట్టేసిన సంగతి తెలిసిందే. పంచ్ ప్రసాద్ ప్రస్తుతం జాతి రత్నాలు, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలతో అదరగొట్టేస్తున్నాడు. దాదాపు మూడున్నర లక్షలు నెలకు సంపాదిస్తున్నాడు అని ఆది బయటపెట్టేశాడు.
ఇప్పుడు పంచ్ ప్రసాద్ బాగా రాణిస్తున్నాడు.. జాతి రత్నాలు, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలతో నెలంతా కూడా బిజీగా ఉంటున్నాడని చెప్పుకొచ్చాడు. అందరూ ఎమోషనల్ అవుతుంటే.. పంచ్ ప్రసాద్ మాత్రం అందరినీ నవ్విస్తుంటాడు. జరిగేదానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటాడు. అలా తాజాగా వదిలిన ప్రోమోలో పంచ్ ప్రసాద్ అదరగొట్టేశాడు. తాజాగా రాఖీ స్పెషల్ ఈవెంట్ ప్రోమోను వదిలారు. ఇందులో పరదేవీ తన అక్కతో , భాను తన అన్నతో, రోల్ రైడా తన చెల్లితో ఇలా అందరూ వచ్చారు. అయితే అందరి చెల్లెళ్లకు అందరూ అన్నాదమ్ములు ఏవో గిఫ్టులు ఇచ్చారు. దీనిపై పంచ్ ప్రసాద్ సెటైర్ వేశాడు. కంటతడి పెడుతూ.
Punch Prasad Satires on His Kidney Problem in Etv Rakhi Special Event
అందరూ అందరికీ పెద్ద గిఫ్టులు ఇచ్చారు.. ఐప్యాడ్, ఐఫోన్ వంటివి ఇస్తున్నారు.. నేను కూడా పెద్ద గిఫ్ట్ ఏదో ఇద్దామని అనుకున్నాను.. కానీ నాకే ఏం లేవు అని కిడ్నీలు చూపిస్తుంటాడు పంచ్ ప్రసాద్. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. పంచ్ ప్రసాద్ వేసిన పంచ్‌కు ఆ మాత్రం రెస్పాన్స్ ఉంటుంది. అందరూ ఒకరకంగా స్పందిస్తే.. పంచ్ ప్రసాద్ మాత్రం ఇంకోలా స్పందిస్తుంటాడు. మొత్తానికి పంచ్ ప్రసాద్ మాత్రం ఈ ఎపిసోడ్‌లో తన ఫ్యామిలీని తెర మీదకు తెచ్చాడు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.