Home » Entertainment » Punch Prasad Satires On Nookaraju Sugar Disease In Jathi Ratnalu Show
Entertainment

Punch Prasad : నూకరాజు రోగం.. పరువుతీసిన పంచ్ ప్రసాద్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 16, 2022, 9:30 pm
Advertisement

Punch Prasad : జబర్దస్త్ కమెడియన్ నూకరాజు గురించి అందరికీ తెలిసిందే. పటాస్ షోతో ఫేమస్ అయిన నూకరాజు ఆ తరువాత మెల్లిగా జబర్దస్త్ షోకి వచ్చేశాడు. అక్కడ తన స్టైల్లో పంచుల వర్షం కురిపించాడు. బాగానే ఫేమస్ అయ్యాడు.అయితే ఇప్పుడు మాత్రం నూకరాజు జాతి రత్నాలు షోలో సందడి చేస్తున్నాడు. అంతకు ముందు రెచ్చిపోదాం బ్రదర్ అనే కామెడీ షోలో కనిపించాడు. ఇక మధ్య మధ్యలో శ్రీదేవీ డ్రామా కంపెనీలో కనిపిస్తుంటాడు.నూకరాజుకు ఉన్న రోగం గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన పని లేదు.

Advertisement

తనకు షుగర్ ఉందనే విషయాన్ని స్కిట్ల రూపంలో ఎన్నో సార్లు చెప్పేశాడు. తన రోగం మీద తానే సెటైర్లు వేసుకుంటూ ఉంటాడు. అలా మిగతా వాళ్లు కూడా నూకరాజు రోగం మీద కౌంటర్లు వేయడం పరిపాటే. తాజాగా వదిలిన జాతి రత్నాలు షో ప్రోమోలో నూకరాజు వ్యాధి మీద సెటైర్లు వేశాడు. ఓ అమ్మాయి వచ్చి టూరిస్ట్, దేశాటన చేయడం గురించి చెప్పింది.ఇంట్లో టూర్‌కు వెళ్తాను అని చెబితే ఉండే కష్టాల గురించి చెబుతాను అని కామెడీ చేసింది. ఇందులో భాగంగానే శ్రీముఖిని టూర్‌కు వెళ్లావా? అని అడుగుతుంది.

Punch Prasad Satires On Nookaraju Sugar Disease In Jathi Ratnalu Show

Advertisement

ఆ తరువాత నూకరాజుని కూడా అడుగుతుంది. ఇంతలో పంచ్ ప్రసాద్ మధ్యలోకి దూరుతాడు. అతను టూర్‌కు వెళ్లడం ఏంటి? టూర్‌లోనే ఉంటాడు.. మధ్య మధ్యలోనే షూటింగ్‌కు వస్తాడు అని తన షుగర్ వ్యాధి గురించి పంచ్ ప్రసాద్ కౌంటర్ వేశాడు.ఇక ఆ తరువాత ఆ అమ్మాయి ఇమాన్యుయేల్ పరువు తీసింది. నిన్ను ఎందుకు అడగలేదని అనుకుంటున్నావా? నీ మొహం చూస్తేనే అర్థమవుతోంది.. ఊర్ల మీద పడి తిరుగుతావ్ అని అంటుంది. దీంతో ఇమాన్యుయేల్ షాక్ అవుతాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి