
Puri Jagannath going to shoot Okka aḍugu Movie with Prabhas
Prabhas : గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటికే ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాలను తీశారు. ఈ రెండు సినిమాలు ఫ్లాపైనా కూడా ప్రభాస్‌కు మాత్రం మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. పూరి స్టైల్ మేకింగ్‌తో రూపొందిన ఈ రెండు సినిమాలను ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికీ చూసుకుంటుంటారు. అయితే, ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమాగా రెబల్ స్టార్ కృష్ణం రాజు రాసిన కథతో ఒక్క అడుగు అనే టైటిల్‌తో సినిమా రూపొందే అవకాశాలున్నట్టు సమాచారం.ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన ఛత్రపతి సినిమాలో ఒక్క అడుగు అంటూ డార్లింగ్ హై ఓల్టేజ్‌తో డైలాగ్ చెబుతాడు.
అదే టైటిల్‌గా ప్రభాస్ పెదనాన్న సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘ఒక్క అడుగు’ మూవీని ప్రతిష్టాత్మకంగా ఆయన సొంత బ్యానర్ అయిన గోపీకృష్ణ మూవీస్ లోనే నిర్మించాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా కంటే ముందే ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒక్క అడుగు కూడా పడలేదు.ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలను కమిటవడం వల్ల ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. పెదనాన్న రాసిన ‘ఒక్క అడుగు’ సినిమాకి ఈ కారణంతోనే ప్రభాస్ డేట్శ్ కేటాయంచట్లేదు.
Puri Jagannath going to shoot Okka aḍugu Movie with Prabhas
నాలుగేళ్ల క్రితమే కృష్ణంరాజు ఈ ప్రాజెక్ట్ డీటైల్స్ వెల్లడించారు. ప్రభాస్ కటౌట్ కు అదిరిపోయే స్క్రిప్ట్…ఒక మంచి మెసేజ్ ఉంది. ఈ ఒక్క అడుగు సినిమా ప్రభాస్ వెయ్యి అడుగుల వేసేలా ఇన్ స్పైర్ చేసే స్క్రిప్ట్ అని తెలిపారు. అంతేకాదు, కృష్ణం రాజు స్వయంగా ఈ కథను సిద్దం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. పూరి జగన్నాథ్ లాంటి వాళ్లు చేయాల్సిన పవర్ పుల్ స్క్రిప్ట్ అని పూరి పేరు రివీల్ చేసారు కృష్ణంరాజు. అయితే, అటు పూరి రెండు పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటు ప్రభాస్ అఫీషియల్‌గా ప్రకటించని వాటితో కలిసి 8 సినిమాలు చేయాల్సి ఉంది. కాబట్టి ఈ ఒక్క అడుగు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పడం కష్టమే.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.