Pushpa 2 The Rule : ఆకాశాన్ని అంటిన పుష్ప2 టిక్కెట్ రేట్లు.. ఇక మహేష్-రాజమౌళి సినిమాకి ఆస్తులు అమ్ముకోవల్సిందే..!
Pushpa 2 The Rule : ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప2 మూవీ గురించే చర్చ. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ మూవీ టిక్కెట్ రేట్స్ ఆకాశాన్ని అంటాయి. ఒక రోజు ముందు అంటే రేపు రాత్రి వేసే ప్రీమియర్ షోలకు అయితే ఏకంగా 800 పెంచారు. అంటే ఒక్కో టికెట్ రేటు 1100 నుంచి 1200 వరకు ఉండనుంది. ఈ టికెట్ రేట్లు చూసి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు.అసలు ఇంత రేటు ఒక్కో టికెట్ కి పెట్టి చూస్తారా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 500 అంటేనే ఎక్కువ అనుకుంటే ఏకంగా 1000 పైన ఉండటంతో నిర్మాతలపై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే పుష్ప 2 టికెట్ రేట్లపై ఓ జర్నలిస్ట్ తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. దీనికి సంబంధించి హైకోర్టులో వాదన జరిగింది. 800 పైన పెట్టి సామాన్యుడు ఎలా సినిమా చూస్తాడు? ఓ కుటుంబం నుంచి 10 మంది సినిమాకు వెళ్తే 10 వేలు ఖర్చుపెట్టాలా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం.
Pushpa 2 The Rule : ఆకాశాన్ని అంటిన పుష్ప2 టిక్కెట్ రేట్లు.. ఇక మహేష్-రాజమౌళి సినిమాకి ఆస్తులు అమ్ముకోవల్సిందే..!
ఇక ఈ సినిమాకే ఇంత హంగామా ఉంటే రాజమౌళి- మహేష్ సినిమా టిక్కెట్ రేట్లు ఇంకా ఏ రేంజ్‌లో ఉంటాయో అని జనాలు ముచ్చటించుకుంటున్నారు. రాజమౌళి సినిమా అంటే మనదేశంలోనే కాదు విదేశాలలోను ప్రేక్షకులు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక మహేష్ బాబుకి కూడా మంచి పేరు ప్రఖ్యతలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే హైప్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అలానే ఈ సినిమా బిజినెస్ కోసం టిక్కెట్ రేట్లు కూడా అమాంతం పెంచేస్తారని అంటున్నారు.
హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన కథాంశం ను రెడీ చేసినట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రాజమౌళి ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్, మహేష్ బాబు ఎప్పుడూ నటించని కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. సినిమా ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. కనీసం అధికారికంగా ప్రకటన కూడా రాలేదు. ఈ ఏడాదిలో సినిమా ను ప్రారంభించి, వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలని రాజమౌళి భావిస్తున్నాడు. 1800 సంవత్సరం నాటి కథను విజయేంద్ర ప్రసాద్ ఇవ్వడం జరిగిందట. ప్రేక్షకులను 225 ఏళ్ల వెనక్కి తీసుకు వెళ్లి రాజమౌళి సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. ఈ సినిమా రికార్డులని తిరగరాస్తుందని అంటున్నారు.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.