Home » Entertainment » Pushpa Movie Heroine Rashmika Mandanna Name Changed In Amazon
Entertainment

Rashmika Mandanna : పుష్ప మిస్టేక్‌.. రష్మిక మందన్నా కాస్త ‘మడోనా’ అయ్యింది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 8, 2022 4:31 pm
Advertisement

Rashmika Mandanna : అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. గత ఏడాది విడుదల అయిన పుష్ప సినిమా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ లో విడుదల అయిన 83 సినిమా కనీసం 150 కోట్ల వసూళ్లు దక్కించుకునేందుకు కిందా మీదా పడింది. కాని పుష్ప సినిమా మాత్రం అక్కడ ఇక్కడ విడుదల అయ్యి ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లో పుష్ప సినిమాకు దాదాపుగా 75 కోట్ల వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. 2021 లో ఇండియాలో విడుదల అయిన సినిమాల్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా పుష్ప సినిమా నిలిచింది.

Advertisement

పుష్ప విడుదల అయిన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కు సిద్దం చేయడం జరిగింది. అమెజాన్ లో ఈ సినిమాను భారీ ఎత్తున చూస్తున్నారు. ఈమద్య కాలంలో అమెజాన్ లో చిన్న చిన్న టెక్నికల్‌ ఇష్యూలు చాలా కామన్‌ అయ్యాయి. పెద్ద ఎత్తున ఆ విషయాలు పరిగణలోకి తీసుకోకూడదు కాని ఇక్కడ ఒక ఆసక్తికర విషయం జరిగింది. పుష్ప సినిమా లో శ్రీవల్లిగా నటించింది రష్మిక మందన్నా అనే విషయం తెల్సిందే. కాని అమెజాన్ వారు మాత్రం ఈ సినిమా లో శ్రీవల్లిగా కనిపించింది రష్మిక మడోనా అన్నట్లుగా పేరు మార్చేశాడు. హీరోయిన్‌ పేరు మార్చడంతో చర్చనీయాంశం అయ్యింది. అమెజాన్‌ వారు ఇంత ప్రముఖ విషయాన్ని ఎలా లైట్‌ తీసుకున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Pushpa movie heroine Rashmika mandanna name changed in amazon

Advertisement

Rashmika Mandanna : హీరోయిన్‌ రష్మిక మందన్నా పేరు మార్చేస్తే ఎలా?

అమెజాన్ లో ప్రస్తుతం పుష్ప ను చూస్తే రష్మిక మందన్నా అని కాకుండా రష్మిక మడోనా అని ఉంది. మరి ఈ విషయమై అమెజాన్ వారు ఎలా స్పందిస్తారు.. రష్మిక మందన్నా ఎలా స్పందించబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఆ స్ట్రీన్ షాట్ ను తీసి చిత్ర యూనిట్‌ సభ్యులకు మరియు అమెజాన్ కు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తున్నారు .ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ పట్టించుకోకుండా అలా అలా ముందుకు వెళ్లడమే తప్ప ఏం చేయలేం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం అమెజాన్ వారు ఇలా సౌత్‌ స్టార్స్ ను అవమానించినట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. పుష్ప సినిమా లో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నా ఆకట్టుకుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి