
pushpa movie starts soon
Pushpa 3 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన మాస్ ఎంటర్‌టైనర్ పుష్ప. లాక్‌డౌన్ తర్వాత విడుదలైన భారీ చిత్రాల్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప-ది రైజ్’ ఒకటి. విడుదలైనప్పుడు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ నెమ్మదిగా ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీగానే వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకూ కూడా పుష్ప రెండు పార్ట్‌ల గురించే సుకుమార్ మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. ‘హ్యాపి బర్త్‌డే సుకుమార్ సర్. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.
మీతో సినిమా ప్రారంభించే రోజు కోసం వెయిట్ చేయలేకపోతున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. అక్కడితో ఆగితే ప్రాబ్లం ఏమీ లేదు. ఆ కిందే ‘2021-ది రైజ్, 2022-ది రూల్, 2023-ది ర్యాంపేజ్’ అంటూ బాంబు పేల్చాడు. దీంతో పుష్ప సిరీస్‌లో మూడో చిత్రం కూడా ఉందని ప్రచారం జోరందుకుంది. కాగా, సుకుమార్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్య, ఆర్య-2 చిత్రాల క్రమంలోనే ఆర్య-3 కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేజీయఫ్ చాప్టర్-2లో కేజీయఫ్3కు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి లీడ్‌నే పుష్ప2 లోనూ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. అంటే.. పుష్పరాజ్ తన సత్తాను పుష్ప2తో మాత్రమే ఆపడని..
pushpa movie starts soon
మున్ముందు పుష్ప3లో కూడా చూపిస్తాడని తెలుస్తోంది. పుష్ప సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటించబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో, పుష్ప2 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.