Home » Entertainment » Puspa Movie Trailer Release Today
Entertainment

Puspa Movie Trailer : పుష్ప ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్… ఈరోజే ట్రైలర్ రిలీజ్… ఎన్నింటికంటే?

Authored By
mallesh
The Telugu News | Updated on: December 6, 2021 10:59 am
Advertisement

Puspa Movie Trailer : షూటింగ్ టైం నుంచే ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప మూవీ.. ప్రతి సారీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. కలప స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని మూవీ టీం రివీల్ చేసింది. మొదట్లో హీరో అల్లు అర్జున్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ తో కనిపించారు. ఇలాంటి షేడ్ లో ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు కనిపించలేదు.

Advertisement

తర్వాత హీరోయిన్ రష్మిక మందన పోస్టర్ ను సైతం విడుదల చేసింది మూవీ టీం. ఈ మూవీలో అనసూయ, సునీల్ ప్రియారిటీ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారట. ఇక సునీల్ కు సంబంధించి మూవీ టీం ఇటీవల పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ఆయన కాస్త భయానకంగానే కనిపించారు. ఆయన ఫేస్ లో నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా కనిపించాయి. ఈ మూవీతో సునీల్ కు విలన్ గా మంచి గుర్తింపు లభించే చాన్స్ ఉంది. పుష్ప మూవీని రెండు పార్టులుగా తెరకెక్తిస్తున్నారు. అయితే మొదటి పార్టు పూర్తయింది.

Puspa Movie Trailer

Advertisement

Puspa Movie Trailer : ఈ రోజే ట్రైలర్

ఇందుకు సంబంధించి తాజాగా మూవీ టీం కొత్త అప్ డేట్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీకి సుకుమార్ డైరెక్షన్ చేయగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే పలు సాంగ్స్ రిలీజ్ కావడంతో. అవి సూపర్ హిట్ అయ్యాయి. కాగా, ఈ మూవీ ఈనెల 17న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి