R Narayana Murthy : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన నారాయణమూర్తి..!
R Narayana Murthy : పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి థియేటర్ల సమస్యలపై స్పందిస్తూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాలపై తన ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానం తప్పనిసరిగా అమలవ్వాలని, దీనివల్ల చిన్న నిర్మాతలకు న్యాయం జరిగి, వారి సినిమాలకు జీవం పోసే అవకాశముంటుందన్నారు. ఈ వ్యవస్థ కోసం తాము పోరాటం చేస్తున్నామని, అలాంటి సందర్భంలో బంధ్‌కి పాల్పడితే.. అది హరి హర వీరమల్లు సినిమా విడుదలను అడ్డుకునేందుకు చేస్తున్నారనే ఆరోపణలు మంత్రులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
R Narayana Murthy : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన నారాయణమూర్తి..!
ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ… సామాన్య ప్రేక్షకులకు సినిమా చూడటమనే వినోదం అతి ఖరీదైనదిగా మారిందన్నారు. పాప్ కార్న్ ధరలు, టికెట్ రేట్లు వంటి అంశాలు సామాన్యుడిని థియేటర్‌కి దూరం చేస్తున్నాయని విమర్శించారు. హాలీవుడ్ నుంచి మనదేశపు క్లాసిక్ సినిమాల వరకు ఎన్నో పెద్ద చిత్రాలు తక్కువ టికెట్ ధరలతోనే విడుదలై విజయం సాధించాయని గుర్తు చేశారు. సినిమా కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు సహజంగానే ఆదరిస్తారని, టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం లేదన్నారు. ఇక బంధ్ అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక సాధనమని, ప్రతి ఒక్కరికీ దానిని ప్రకటించే హక్కు ఉందని నారాయణ మూర్తి అన్నారు.
అయితే జూన్ 1న ప్రకటించిన బంధ్‌కు ముందుగానే ఫిల్మ్ ఛాంబర్‌కు సమాచారం ఇవ్వకపోవడం వల్ల అది ఆ అమలులోకి రాకపోవచ్చని చెప్పారు. అయినప్పటికీ ఈ బంధ్‌ను హరి హర వీరమల్లు సినిమాతో లింక్ చేయడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని తనకెంతో గర్వంగా ఉందని, కానీ అధికార స్థాయిలో ఉండే వ్యక్తిగా అన్ని వర్గాలను సమానంగా చూడాలని సూచించారు. మీరు రాజులు మీరు చెప్పినట్లే కలుస్తాం.. కానీ పూర్వకాలంలో ప్రజల దగ్గరికే రాజులు వచ్చి వాళ్ళ సమస్యలు వినేవారు..మీరు గెలిచినా తర్వాత ఇండస్ట్రీ జనాలను పిలిచి సమస్యలు వినుంటే బాగుండేది కదా అని నారాయణ మూర్తి ప్రశ్నించారు. ఇక చిన్న నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారని, వారికి ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.