Home » Entertainment » R Narayana Murthy University Full Video Song Video
Entertainment

R. Narayana Murthy : ఎప్పుడు డైలాగులు చెప్పే ఆర్ నారాయణమూర్తి… మొట్టమొదటిసారి డాన్స్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 16, 2023, 6:30 pm
Advertisement

R. Narayana Murthy : ఆర్ నారాయణ మూర్తి అందరికీ సుపరిచితుడే. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేస్తూ మెసేజ్ ఓరియంటెడ్ తరహా సబ్జెక్టులతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్న ఆర్.నారాయణమూర్తి సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ పెళ్లి చేసుకోకుండా… సినిమాయే తన ప్రపంచం అన్న రీతిలో జీవిస్తున్నారు.

Advertisement

ఆర్ నారాయణ మూర్తి ఇప్పటివరకు సినిమాలలో ఏప్పుడు కూడా డాన్స్ చేయలేదు. కానీ తొలిసారి ఫస్ట్ టైం తన కొత్త సినిమా యూనివర్సిటీలో… గతానికి భిన్నంగా డాన్స్ చేశారు. పిల్లల ఫీజులకు సంబంధించి విద్యాసంస్థలు వ్యవహరించే తీరును… తెలియజేసే ఈ పాటలో… నారాయణమూర్తి తనదైన శైలిలో డాన్స్ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిల్లల చదువుల పై ఫీజుల భారాలు…

Advertisement

R Narayana Murthy UNIVERSITY Full Video Song Video

ఇంకా పరీక్ష పేపర్ లీకేజ్ వాటి వల్ల సమాజంలో కలిగే దుష్పరిమానాలు చూపించే దిశగా “యూనివర్సిటీ” సినిమా షూటింగ్ జరుపుకోవడం జరిగింది. ఒత్తిడి చదువుల వల్ల స్టూడెంట్స్ మైండ్ సెట్ పాడేపోవడం ఇంకా ఫీజుల వల్ల తల్లిదండ్రులు పడే బాధ వేదన వంటి సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. మరి ముఖ్యంగా వేలకు వేలు చదువులకు ఖర్చుపెట్టినా గానీ.. ఆ చదువును కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాక సరైన ఉద్యోగం దొరకకపోవటం వంటి విషయాలనీ దృష్టిలో పెట్టుకుని ఈ యూనివర్సిటీ సినిమా తెరకెక్కించడం జరిగింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి