Raashi Khanna : ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల సుందరి రాశీ ఖన్నా. ఈ సినిమా సక్సెస్ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. అది అలా ఉంటే రాశీ ఖన్నా.. దక్షిణాదిలో తాను ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నానని, అక్కడ తన టాలెంట్‌కు తగిన రోల్స్ రాలేదంటూ, అక్కడ హీరోయిన్స్‌ను మిల్కీ బ్యూటీ, డాల్స్ అంటారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశారని గత కొన్నిరోజులగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. తనపై నెగెటివ్‌గా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాశీ స్పందిస్తూ..
దక్షిణాది చిత్ర పరిశ్రమను దూషిస్తూ తాను వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. భాష ఏదైనా.. సినిమా ఏదైనా, తాను చేసే ప్రతి సినిమాపై గౌరవం మర్యాద ఉంటుందన్నారు. దయచేసి ఆ ప్రచారాలను ఇకనైనా ఆపండంటూ ట్వీట్ చేశారు రాశీ ఖన్నా.చిన్న వయసులోనే రాశీ ఖన్నా ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ – నాగశౌర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఖాతాలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి.
వాటితో తెగ బిజీగా ఉంది రాశీ.రాశీ ఖన్నా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అడపాదడపా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ అందాల రచ్చ చేస్తుంది. రాశీ ఖన్నా స్టన్నింగ్ లుక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ఆమె ఫొటోలకి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. చివరిగా తెలుగులో హీరో గోపీచంద్ తో కలిసి నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. దీని తర్వాత రాశీ హిందీలో ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం బ్యూటీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
Dil Raju : పుష్ప 2 ప్రీమియర్ షో వివాదంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి అందరికీ…
Cyber Crime : 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ కు బలి అయ్యాడు. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు.…
Sukumar : లెక్కల మాస్టారు సుకుమార్ తాజాగా పుష్ప2 చిత్రంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.…
Squid Game 2 Review : నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ లలో…
Loan : పరిస్థితుల కారణంగా చాలామంది తమ ద్రవ్య అవసరాలను తీర్చుకోవడానికి బాహ్య సహాయాన్ని కోరవలసి ఉంటుంది. కొందరు తమ…
Balakrishna Jr NTR : నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది అన్నది అందరు…
Rohit Sharma : మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భారత ఆటగాళ్లు…
Womens : మహిళలు రోజు దిన చర్యలో చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత వేల వెలకట్టలేని మూలిం చెల్లించుకోవాల్సి…
This website uses cookies.