Raashi Khanna : రాశీ ఖ‌న్నా అందాల ఆర‌బోత వేరే లెవ‌ల్‌లో.. మైమ‌ర‌చిపోతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raashi Khanna : రాశీ ఖ‌న్నా అందాల ఆర‌బోత వేరే లెవ‌ల్‌లో.. మైమ‌ర‌చిపోతున్న ఫ్యాన్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :24 April 2022,2:30 pm

Raashi Khanna : ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల సుంద‌రి రాశీ ఖన్నా. ఈ సినిమా స‌క్సెస్ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. అది అలా ఉంటే రాశీ ఖన్నా.. దక్షిణాదిలో తాను ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నానని, అక్కడ తన టాలెంట్‌కు తగిన రోల్స్‌ రాలేదంటూ, అక్కడ హీరోయిన్స్‌ను మిల్కీ బ్యూటీ, డాల్స్ అంటారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశారని గత కొన్నిరోజులగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. త‌న‌పై నెగెటివ్‌గా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాశీ స్పందిస్తూ..

ద‌క్షిణాది చిత్ర పరిశ్రమను దూషిస్తూ తాను వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. భాష ఏదైనా.. సినిమా ఏదైనా, తాను చేసే ప్రతి సినిమాపై గౌరవం మర్యాద ఉంటుందన్నారు. దయచేసి ఆ ప్రచారాలను ఇకనైనా ఆపండంటూ ట్వీట్ చేశారు రాశీ ఖన్నా.చిన్న వయసులోనే రాశీ ఖన్నా ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ – నాగశౌర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఖాతాలో అర‌డ‌జ‌నుకి పైగా సినిమాలు ఉన్నాయి.

raashi khanna cute looks are stunning

raashi khanna cute looks are stunning

Raashi Khanna : రాశీ ఖ‌న్నా ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా..

వాటితో తెగ బిజీగా ఉంది రాశీ.రాశీ ఖ‌న్నా సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా అడ‌పాద‌డ‌పా సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ అందాల ర‌చ్చ చేస్తుంది. రాశీ ఖ‌న్నా స్టన్నింగ్ లుక్స్ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఆమె ఫొటోల‌కి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. చివరిగా తెలుగులో హీరో గోపీచంద్ తో కలిసి నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. దీని తర్వాత రాశీ హిందీలో ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం బ్యూటీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది