Home » Entertainment » Raashi Khanna Workout Pics
Entertainment

Raashi khanna : రాశీ ఖన్నా అందాల ఆరబోత.. అదిరిపోయిన ఫోటో

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 3, 2021, 11:45 am
Advertisement

Raashi khanna : రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా వర్కవుట్లతో శరీరాకృతిని మార్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం తారలందరూ కూడా జిమ్‌లో కసరత్తులతో దుమ్ములేపుతున్నారు. రాశీ ఖన్నా చేసే వర్కవుట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా రాశీ ఖన్నా వర్కవుట్లు చేసి బాగానే అలిసిపోయినట్టుంది.

Advertisement

Raashi khanna workout pics

రాశీ ఖన్నా ఇప్పుడు కోలీవుడ్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో రాశీ ఖన్నా చేతిలో ఇప్పుడు ఏ ఆఫర్ కూడా లేదు. తమిళంలో రెండు సినిమాలు వరుసగా సెట్స్ మీదున్నాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక వరుసగా షూటింగ్‌లతో రాశీ ఖన్నా రచ్చ రచ్చ చేసింది. వీకెండ్స్, పండుగలు అనే తేడా లేకుండా రోజూ షూటింగ్‌లతో గడిపేది. మధ్యలో రాశీ ఖన్నా బర్త్ డే, ఆమె సోదరి పెళ్లి వేడుకల్లో సందడి చేసింది.

Advertisement

తాజాగా రాశీ ఖన్నా జిమ్‌లో బాగానే కష్టపడుతోన్నట్టు కనిపిస్తోంది. ఊరికే తిని కూర్చుంటే.. మనం అనుకున్నది రాదంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. శ్రమించాల్సిందే.. ఒళ్లు వంచాల్సిందే అనేట్టుగా రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా పెట్టిన పోజు, షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రాశీ ఖన్నా చివరగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో పలకరించింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రాశీ ఖన్నాకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి