Raj Tarun : రాజ్ తరుణ్ బండారం బయటపడింది.. మాల్వీతో చాట్ లీక్..!
Raj Tarun : యంగ్ హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి కొద్ది రోజులుగా ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్, తాను 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. ఇద్దరు గుడిలో వివాహం కూడా చేసుకున్నామని కూడా పేర్కొంది. అయితే తమ మధ్య హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రాకతో గొడవలు మొదలయ్యాయని లావణ్య చెప్పుకొచ్చింది. మాల్వీకి, రాజ్ తరుణ్‌కి ఇల్లీగల్ రిలేషన్ ఉందని.. ఆమె కోసం రాజ్.. తనను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అలానే మాల్వీ, ఆమె సోదరుడు తనను చంపుతామని బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించింది.
లావణ్య తన ఫిర్యాదులో రాజ్ తరుణ్ తనని గర్భవతిని కూడా చేశాడని.. రెండు నెలల సమయంలో సర్జరీ చేసి తీయించాడని కూడా తెలిపింది. ఈ మేరకు దానికి సంబంధించిన రిపోర్టులను కూడా పోలీస్ స్టేషన్‌లో అందించింది. లావణ్య సాక్ష్యాలు పోలీస్ స్టేషన్‌లో అందజేయడంతో పోలీసులు రాజ్ తరుణ్ ఫై కేసు నమోదు చేశారు. దీంతో రాజ్ తరుణ్‌కి నోటీసులు పంపించారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాల మెసేజ్ చాట్ లీక్ అయ్యింది. 2023లో మాల్వీ మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ తరుణ్ నుంచి వచ్చిన ప్రపోజల్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ అంటూ మాల్వీ మల్హోత్రా రిప్లై ఇచ్చింది. ఇక మాల్వి అనేక సార్లు రాజ్ తరుణ్‌కు హోటల్స్ బుక్ చేసింది. ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్‌లో రాజ్ తరుణ్, మాల్వి కలిసేవారు.
Raj Tarun : రాజ్ తరుణ్ బండారం బయటపడింది.. మాల్వీతో చాట్ లీక్..!
వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవారు. రోజువారీ ప్లానింగ్స్, ట్రిప్స్, ఔట్స్ ప్రతిదీ షేర్ చేసుకునేవారని చాట్‌ని బట్టి అర్ధమవుతుంది. ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్ తరుణ్ చెబుతూ రావడంతో ఇప్పుడిలా వారి మధ్య జరిగిన మెసేజ్ చాట్స్ లీక్ కావడం సంచలనంగా మారింది. ఇటీవల లావణ్య ఆత్మహత్య చేసుకుంటానంటూ తన లాయర్ కి మెసేజ్ కూడా పంపడం మనం చూశాం. తనకి రాజ్ తరుణ్ కావాలని ఆయనతో జీవితం పంచుకోవాలని తాను భావిస్తున్నట్టు లావణ్య తెలియజేసింది. ఈ చాట్ లీక్ తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాలి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.