
Raj Tarun : రాజ్ తరుణ్ ప్రేమ కథలో ఎన్నో ట్విస్ట్‌లు.. ఆయన ఇద్దరి లవర్స్ మధ్య జరిగిన బిగ్ ఫైట్
Raj Tarun : టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన రాజ్ తరుణ్ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో మనోడికి మంచి ఆఫర్స్ వచ్చాయి. మొదట్లో మెరుపులు మెరిపించిన రాజ్ తరుణ్, వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. ఇప్పుడు ఆయన కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడర సామీ విడుదలకు సిద్ధం అవుతుంది. రిలీజ్ మరి కొద్ది రోజులలో ఉండగా, మనోడు వివాదంలో చిక్కుకున్నాడు.
లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ మీద ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం… లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అని ఆమె వాపోయింది. అయితే లావణ్య వ్యాఖ్యలపై స్పందించిన రాజ్ తరుణ్..నేను లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం నిజమే. విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఫేస్బుక్ ద్వారా లావణ్య పరిచయం అయింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా స్నేహం మరింతగా బలపడింది.
Raj Tarun : రాజ్ తరుణ్ ప్రేమ కథలో ఎన్నో ట్విస్ట్‌లు.. ఆయన ఇద్దరి లవర్స్ మధ్య జరిగిన బిగ్ ఫైట్
రెండు మూడు ఏళ్ళు కలిసి ఉన్నాం.. ఆ తర్వాత మేము దూరం అయ్యాం. లావణ్య వేరే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. అలాంటప్పుడు ఆమెతో నేను ఎలా ఉంటాను? లావణ్యను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు మాట ఇవ్వలేదని రాజ్ తరుణ్ అన్నాడు., ఆమె వ్యవహారశైలి నచ్చక ఆమె నుండి విడిపోయానని రాజ్‌తరుణ్ వెల్లడించారు. డ్రగ్స్ మానేయమని ఎన్నిసార్లు చెప్పినా లావణ్య వినలేదన్నారు. మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య సన్నిహితంగా ఉంటోందని ఆరోపించారు. వారిద్దరికీ ఎలా పరిచయం అయిందో తనకు తెలియదన్నారు. తన ఫ్లాట్ లోనే వారిద్దరూ ఉంటున్నారని, తాను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని తెలిసి తన కంటే ముందే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. ఈ ట్రయాంగిల్ ప్రేమకథలో సినిమాకు మించిన ట్విస్టులు ఉండడంతో ప్రతి ఒక్కరు దీనిపై ఫోకస్ చేస్తున్నారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.