Home » Entertainment » Raj Tarun Stunning Comments On Pawan Mariages
Entertainment

Raj Tarun : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్లిళ్ల‌పై రాజ్ త‌రుణ్ ల‌వ‌ర్ సంచ‌ల‌న కామెంట్స్..!

Authored By
aruna
The Telugu News | Published on: July 12, 2024, 1:36 pm
Advertisement

Raj Tarun : రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ఏదో ఒక సంద‌ర్భంలో విపరీతమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయో మ‌నం చూశాం. అయితే వాటిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర స‌మాధానాలు కూడా ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రాజ్ త‌రుణ్ మాజీ భార్య లావ‌ణ్య కూడా ప‌వన్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. హీరో రాజ్ తరుణ్, అతని మాజీ ప్రియురాలు లావణ్య వ్యవహారం ఇప్పుడు కేసుల వరకు వచ్చింది. లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

Advertisement

Raj Tarun లావ‌ణ్య నోట ప‌వ‌న్ పెళ్లిళ్ల మాట‌..

మరో వైపు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపైన కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది మాల్వీ మల్హోత్రా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా లావణ్యపై బెదిరింపులు, వ్యక్తిత్వ హననం అభియోగాలపై కేసు నమోదు చేసారంట. సోషల్ మీడియాలో ఇప్పుడు వీరి గురించే చర్చ నడుస్తోంది. మీడియాలో సైతం ప్రతిరోజు వీరి గురించి విపరీతంగా కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా లావణ్య ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. న్యాయం కోసం తాను ఎంతవరకైనా పోరాడుతానని పేర్కొంది. రాజ్ తరుణ్ తనకి కావాలని కోరుతుంది. ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఈ విషయంపై కలుస్తానని లావణ్య పేర్కొంది. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టమని లావణ్య తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ తన భార్యల విషయంలో ఎవరిని మోసం చేయలేదని పేర్కొంది.

Raj Tarun : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్లిళ్ల‌పై రాజ్ త‌రుణ్ ల‌వ‌ర్ సంచ‌ల‌న కామెంట్స్..!

Advertisement

రాజ్ తరుణ్ తనకి చేసిన అన్యాయాన్ని పవన్ దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పుకొచ్చింది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నానని లావణ్య తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. రాజ్ తరుణ్ తనని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని, మోసం చేసాడని పవన్ కళ్యాణ్ కి విన్నవించుకుంటానని లావణ్య తెలిపింది. మరో వైపు లావణ్య తరపున కళ్యాణ్ దిలీప్ సుంకర కేసుని టేకప్ చేసి లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే టాలీవుడ్ లో చాలా మందికి రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ, సహజీవనం గురించి తెలిసిన బయటకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేయ‌డం లేదు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి