Tammareddy Bharadwaj Comments On RRR Team About Oscars Award
Rajamouli : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఆరు నెలల క్రితం వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదయ్యాయి. కలెక్షన్స్ కంటే ఎక్కువగా ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ అవుతూ ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మీడియాలో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ దక్కడం ఖాయం అంటూ పలువురు ప్రముఖులు వ్యాఖ్యలు చేశారు. దాంతో ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఆస్కార్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ కి ఈ సినిమాను పంపించేందుకు అర్హత లేదు అంటూ భారత ఫిలిం అకాడమీ సంచలన నిర్ణయం తీసుకొని ఈ చిత్ర యూనిట్ సభ్యులకు నిరాశ మిగిల్చిన విషయం తెలిసిందే.
ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రాజమౌళి టీం ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలిచేందుకు జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. దేశం తరఫున అధికారికంగా కాకుండా ఇండిపెండెంట్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఈ చిత్రం ఏకంగా 14 కేటగిరీల్లో నామినేషన్ కోసం దరఖాస్తు చేసింది. అందులో రెండు మూడు నామినేషన్స్ దక్కిన కూడా చాలా పెద్ద గౌరవం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. అవార్డు దక్కడం సంగతి ఏమో కానీ కనీసం నామినేషన్స్ దక్కితే రాజమౌళి పరువు దక్కినట్లే.. ఎందుకంటే భారత తరఫున అధికారికంగా ప్రకటించకుంటే ప్రైవేట్ గా ఆస్కార్ కి నామినేషన్ కోసం దరఖాస్తు చేశారు.
Rajamouli RRR Movie interesting Oscar award entry in nominations
ఒకవేళ ఆస్కార్ నామినేషన్ దక్కక పోతే కచ్చితంగా ఇండియన్ ఫిల్మ్ చరిత్రలో రాజమౌళి యొక్క వ్యతిరేక తీరు గురించి నిలిచి పోతుంది. భారత తరఫున అధికారికంగా పంపించకున్నా కూడా నామినేషన్స్ ప్రైవేట్ గా అప్లై చేసి దక్కించుకొని అవార్డు సొంతం చేసుకుంటే ఆ విషయం కూడా ఇండియన్ సినీ చరిత్రలో చిర స్థాయిగా నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు. ఈ రెండిట్లో ఏది జరుగుతుంది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒకవేళ జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్స్ లో నామినేషన్స్ దక్కించుకుంటే హీరో అవుతాడు లేదంటే అనవసరంగా ప్రయత్నించి జీరో అవుతాడు. మరి మన జక్కన్న ఇన్నాళ్లు హీరోగా నిలిచాడు, హీరోల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యతను దక్కించుకున్నాడు. మరి ఈ విషయంలో హీరో అవుతాడా జీరో అవుతాడా అనేది చూడాలి.
TDP | పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి…
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, అతని ఆటలతో కాకుండా ఇప్పుడు ప్రేమలో…
Bala Krishna | నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న చిత్రం అఖండ 2. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని అత్యంత…
Shilpa Shirodkar | సూపర్ స్టార్ మహేశ్ బాబు మరదలు, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు చెందిన కారును ఢీకొట్టిన…
Antibiotics : ప్రస్తుత కాలంలో ప్రజలు ఏ చిన్న అనారోగ్య సమస్యకు గురైన సరే ఇలాంటి బయటికి వినియోగం విపరీతంగా…
Potato Chips : సాధారణంగా చాలామంది కూడా పొటాటో చిప్స్ అంటే ఇష్టపడతారు.పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. పిల్లలైతే…
Monsoon Season : వర్షాకాలంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు.కొన్ని ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.…
coolie movie Review : భారీ అంచనాల మధ్య రజనీకాంత్ , లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న కూలీ చిత్రం…
This website uses cookies.