Home » Entertainment » Rajamouli Rrr Will Release 13th October 2021
Entertainment

RRR Movie అప్డేట్.. ఆర్ఆర్ఆర్ మూవీ అక్టోబర్ 13న విడుదల

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 25, 2021, 3:18 pm
Advertisement

RRR Movie ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. ప్యాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాజమౌళి అద్భుతంగా మలుచుతున్నాడు. ప్రేక్షకులను వేరే ఊహా లోకానికి తీసుకెళ్లేలా రాజమౌళి మంచి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన రెండు టీజర్లు బాగానే వైరల్ అయ్యాయి. రామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీం క్యారెక్టర్‌లో ఎన్టీఆర్‌ లను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్లు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి.

Advertisement

rajamouli RRR Will Release 13th october 2021

తాజాగా ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కూడా ప్రారంభమైంది. సినిమాకు అత్యంత కీలకమైన ఎపిసోడ్‌ను ఇప్పుడు షూట్ చేయబోతోన్నారట. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి పోరాడుతారట. ఇక ఈ సీన్స్ పెద్ద స్క్రీన్‌పై ఓ విజువల్ వండర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ యూనిట్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు, మెగా నందమూరి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసింది.

Advertisement

RRR Movie 13న  మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఇప్పటి వరకు సింగిల్‌గా కనిపించిన రామరాజు, భీంలను ఇప్పుడు కలిసి చూపించారు. ఆల్రెడీ సినిమా రిలీజ్ డేట్ లీక్ అవ్వడంతో ఆలస్యం చేయకూడదని, అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే సినిమా విడుదల కానుందని ప్రకటించారు. అక్టోబర్ 13న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తెలిపారు. మొత్తానికి రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను ఇలా ఒకే పోస్టర్‌లలో చూడటంతో అభిమానులుసంబరాలు చేసుకుంటున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి