Home » Entertainment » Rajanikanth Is The Reason For Gowthami Not Acting With Chiranjeevi
Entertainment

Gowthami : అతని వ‌ల్లే చిరంజీవితో రెండు సినిమా చేయ‌లేక‌పోయా : గౌత‌మి

Authored By
vamana sai
The Telugu News | Updated on: May 3, 2021 5:17 pm
Advertisement

Gowthami : గౌతమి సీనియర్ హీరోయిన్ అని అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన గౌతమి ఒక దశలో స్టార్ హీరోయిన్‌గా సౌత్‌లో ఒక వెలుగు వెలిగింది. అయితే 1980 నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవితో చిన్న సీన్ చేసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని స్టార్ హీరోయిన్స్ దగ్గర్నుంచి చిన్న చిన్న ఆర్టిస్టుల వరకు అందరికీ ఉంటుంది. ఆయన సినిమాలో ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే చేయాలా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అవసరమైతే మెగాస్టార్ తో సినిమా అవకాశం వస్తే చేతిలో ఉన్న సినిమాని కూడా వదిలేసే వారున్నారు.

Advertisement

rajanikanth-is-the-reason-for-gowthami-not-acting-with-chiranjeevi

కానీ సీనియర్ హీరోయిన్ గౌతమికి మాత్రం ఒకటికి రెండుసార్లు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే చేయలేకపోయిందట. అందుకు కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెప్పుకొచ్చింది. టి.సుబ్బరామిరెడ్డి నిర్మాతగా స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమా స్టేట్ రౌడీ. ఈ సినిమాలో గౌతమికి అవకాశం వచ్చిందట. కానీ ఆ సమయంలో గౌతమి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన సినిమా చేస్తుందట. ఒకేసారి అటు రజనీకాంత్ సినిమా చేస్తూ ఇటు చిరంజీవి సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేకనే ఈ అవకాశం వదులుకుందట.

Advertisement

Gowthami : గౌతమి గ్లామర్ ట్రీట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఈ రకంగా మెగాస్టార్ సరసన అది కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయింది గౌతమి. ఇలాగే మరోసారి చిరంజీవి సరసన అవకాశం వస్తే కూడా మిస్ చేసుకుందట. ఇక శంకర్ తమిళ, తెలుగు సినిమా ఇండస్ట్రీస్ కి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన జెంటిల్ మాన్ సినిమాలో చేసిన చికుబుకు చికుబుకు రైలే సాంగ్ ఇప్పటికీ మోగుతూనే ఉంటుంది. ఈ సాంగ్‌లో గౌతమి గ్లామర్ ట్రీట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి