
Rajasekhar : మళ్లీ చిరంజీవితో ఢీ కొడుతున్న రాజశేఖర్.. ఈసారి వైల్డ్ ఫైర్ సెటప్ రెడీ..!
Rajasekhar : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా విజువల్ గ్రాండియర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు. యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా తర్వాత చిరంజీవి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మెగాస్టార్ లోని ఊర మాస్ ని తీసుకొచ్చేలా ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తుంది.
ఈ సినిమా నౌన్స్ మెంట్ తోనే బ్లడ్ బాత్ ఫోటో షేర్ చేశాడు దర్శకుడు శ్రీకాంత్. నాని ఈ కాంబో సెట్ అవ్వడానికి రీజన్ అని తెలుస్తుంది. ఓ పక్క నానితో రెండో సినిమా చేస్తూనే మరోపక్క చిరంజీవి సినిమా ఫిక్స్ చేసుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఐతే చిరు సినిమాలో విలన్ గా ఒక స్టార్ హీరోని లాక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది. చిరు సినిమాలో నటించే ఆ స్టార్ ఎవరంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ అని తెలుస్తుంది.
Rajasekhar : మళ్లీ చిరంజీవితో ఢీ కొడుతున్న రాజశేఖర్.. ఈసారి వైల్డ్ ఫైర్ సెటప్ రెడీ..!
సీనియర్ హీరోలంతా కూడా ఇప్పుడు వారి పంథా మార్చి ఆఫర్లు అందుకుంటున్నారు. హీరోగా ఛాన్సులు రాని వారు విలన్ గా మారి సినిమాలు చేస్తున్నారు. రాజశేఖర్ కూడా విలన్ గా టర్న్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. సోలోగా సినిమాలు తీస్తే వర్క్ అవుట్ అవ్వట్లేదని గుర్తించిన రాజశేఖర్ ఇక మీదట ప్రతి నాయకుడి పాత్రలైనా చేయాలని చూస్తున్నాడు.
ఈ టైం లోనే చిరు సినిమా ఆఫర్ రావడం లక్కీ అని చెప్పొచ్చు. చిరుతో రాజశేఖర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే కచ్చితంగా అతని కెరీర్ కు మంచి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పొచ్చు. చిరు సినిమాలో విలన్ గా చేస్తే రాజశేఖర్ కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో రాజశేఖర్ విలనిజం ఎలా ఉంటుందో చూడాలి. Megastar Chiranjeevi , Rajasekhar , Srikanth Odela , Nani ,
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.