Home » Entertainment » Rakesh Master In Extra Jabardasth
Entertainment

rakesh master : రాకేష్ మాస్టర్‌ను వాడేస్తున్నారు.. ‘జబర్దస్త్’లో రచ్చ రచ్చే!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: February 27, 2021, 10:00 am
Advertisement

rakesh master : ఒకప్పుడు అంటే రాకేష్ మాస్టర్ ఎవరు అని అడిగేవారేమో. కానీ ఇప్పుడు అతని పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులుండరు. యూట్యూబ్ నానా కూతలు కూసి టాలీవుడ్ హీరోలపై నిప్పులు చెరిగాడు. ఫ్యాన్స్ ఎంతగా బెదిరింపులకు పాల్పడ్డా, ఎంతగా ట్రోల్ చేసినా కూడా వెనుకడుగు వేయలేదు. అలా హీరోలందరినీ ఓ రౌండ్ వేసుకుని యూట్యూబ్‌లో తెగ ఫేమస్ అయ్యాడు. లాక్డౌన్, అంత కంటే ముందు రాకేష్ మాస్టర్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Advertisement

rakesh master In Extra Jabardasth

అలా రాకేష్ మాస్టర్ క్రేజ్‌ను జబర్దస్త్ క్యాచ్ చేసింది. ఆయన మాట్లాడే మాటలు, చేతలను బాగానే ఇమిటేట్ చేస్తూ స్కిట్లను వేసేవారు. అయితే వాటిపైనా రాకేష్ మాస్టర్ స్పందించేవాడు. తనను ఇమిటేట్ చేయడం బాగానే ఉందంటూ, కానీ అంత పర్ఫెక్ట్‌గా ఏమీ చేయలేదంటూ చెప్పుకొచ్చాడు. అలా రాను రాను బుల్లితెరపై రాకేష్ మాస్టర్ క్రేజ్ పెరిగింది. ఇప్పుడు పలు షోల్లో రాకేష్ మాస్టర్ కనిపిస్తున్నాడు. జబర్దస్త్, పండుగలకు చేసే స్పెషల్ ఈవెంట్లలోనూ రాకేష్ మాస్టర్ రచ్చ చేస్తున్నాడు.

Advertisement

rakesh master : రాకేష్ మాస్టర్‌ను వాడేస్తున్నారు..

మరీ ముఖ్యంగా ఇప్పుడు జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ టీంలో రాకేష్ మాస్టర్ సందడి చేస్తున్నాడు. వెరైటీ కటింగ్‌తో రాకేష్ మాస్టర్ రావడం, అతనితో పాటు నరేష్ కూడా అదే గెటప్‌తో రావడం బాగా కుదిరింది. గత వారం కూడా ఓ స్కిట్ వేసిన రాకేష్ మాస్టర్.. ఇప్పుడు మళ్లీ ఓ స్కిట్ వేశాడు. మొత్తానికి ఇప్పుడు రాకేష్ మాస్టర్‌కు చేతి నిండా పని దొరికినట్టైంది. అలాగే అతన్ని వాడుకుని స్కిట్లను కూడా బాగానే హైలెట్ అయ్యేలా చూసుకుంటున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి