rakul preet singh cutest looks
Rakul Preet Singh : కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా తర్వాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఇటీవలి కాలంలో రకుల్‌కి తెలుగులో పెద్దగా సక్సెస్ రావడం లేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తుంది. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్న ఈ భామ ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.
రీసెంట్‌గా వలిమై సినిమాతో మంచి హిట్టు కొట్టాడు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్. ఆయన తర్వాతి సినిమాలో రకుల్ కథానాయికగా ఎంపికైందని టాక్.గ్లామర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో పరిచయం. తన అందం, అభినయంతో సౌత్ ఆడియెన్స్ కు కొన్నేండ్లుగా అలరించింది. కుర్రాళ్ల కలల రాకుమారిలా మారిపోయింది. రకుల్ గ్లామర్ ధాటికి యుతవ చిత్తవ్వాల్సిందే. తెలుగులో చివరిగా పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి ‘కొండపొలం’లో నటించింది రకుల్. హిందీ చిత్రం ‘ఎటాక్’ జాన్ అబ్రహం తో కలిసి నటించింది రకుల్. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా నిరాశపరచింది.
rakul preet singh cutest looks
ఇక ‘రన్ వే 34’లో నూ కీలక పాత్రను పోషించింది. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా ప్రమోషన్ లో భాగంగా కొద్ది రోజులుగా తెగ సందడి చేస్తుంది. ఇందులోభాగంగా రకుల్ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇందులో రకుల్ బోల్డ్ లుక్స్ లో కనిపిస్తూ థ్రిల్ చేస్తుంది. అమ్మడి అందచందాలకు కుర్రకారు మైమరచిపోతున్నారు. ఈ అమ్మడి స్టన్నింగ్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ్ హల్‌చల్ చేస్తున్నాయి. స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోందీ ఫిట్ నెస్ బ్యూటీ. మత్తెక్కించే చూపులతో నెటిజన్ల గుండెలు జారిపోయేలా చేస్తోంది. అయితే రకుల్ గ్లామర్ కు సామాన్యులే కాకుండా సెలబ్స్ సైతం ఫిదా అవుతున్నారు.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
This website uses cookies.