Home » Entertainment » Rakul Preet Singh Dance In Beach
Entertainment

Rakul Preet Singh: బీచ్‌లో బ్యాండ్ మేళం.. రకుల్ స్టెప్పులు వైరల్

Authored By
Sam C
The Telugu News | Published on: March 1, 2022, 4:30 pm
Advertisement

Rakul Preet Singh: ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మ‌డు ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అవడమే కాక అక్కడ ఒక నటుడు, నిర్మాత అయిన వ్యక్తిని ప్రేమించి, త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. సినిమాల‌కి కాస్త గ్యాప్ దొర‌క‌డంతో ఈ అమ్మ‌డు మాల్దీవుల బాట ప‌ట్టింది. అక్క‌డ‌త‌న ప్రియుడితో క‌లిసి తెగ సంద‌డి చేస్తుంది. ఫుడ్ ఐటెమ్స్ తో పాటు ఎన్నో బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేస్తోంది.తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బీచ్ లో మ్యూజిక్ బీట్స్ కు అనుగుణంగా ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Advertisement

ర‌కుల్ ఎంజాయ్‌మెంట్ మాములుగా లేదంటూ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌తి రోజు త‌న అందాల ఆర‌బోత‌కు సంబంధించి పోస్ట్‌లు పెడుతూ రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ‌ని చూసి మైమ‌ర‌చిపోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో జగత్ జంత్రి, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్, రన్ వే 34, అటాక్, అయలాన్ చిత్రాలు ఉన్నాయి.చ‌దువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేస్తూ వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అనుకోకుండా 7g బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపికయింది.. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేస్తుంటే తక్కువ డబ్బులు వస్తున్నాయి హీరోయిన్ గా నటిస్తే దానికి పదింతలు డబ్బులు వస్తాయి అని ఎవరు చెప్పడంతో ఆమె హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది.

Rakul Preet Singh : స్టెప్పులు బాగున్నాయిగా..!

rakul preet singh dance in beach

Advertisement

అలా మొదలైన ఆమె కెరీర్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఒక కీలక మలుపు తీసుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తనకు వరుస అవకాశాలు దక్కాయి. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అలా ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి