Home » Entertainment » Rakul Preet Singh Enjoys Lohri Celebration At Mayday Set
Entertainment

అలా చేసే సరికి ఎగ్జైట్మెంట్.. ఫుల్ జోష్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 14, 2021, 8:35 pm
Advertisement

రకుల్ ప్రీత్ సింగ్‌ ఒక్కోసారి ఆనందాన్ని భరించలేదు.. చిన్న పిల్లలా మారిపోయి గంతులు వేస్తుంది.. నిన్న మేడే షూటింగ్‌లోనూ రకుల్ ప్రీత్ సింగ్‌ సర్ ప్రైజింగ్‌గా ఫీలైనట్టుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్‌ అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ మూవీ మేడే షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆ మధ్య రకుల్ ప్రీత్ సింగ్‌‌కు కరోనా రావడంతో కాస్త గ్యాప్ వచ్చింది. అలా క్వారంటైన్‌ను ముగించుకోవడం వెంటనే రంగంలోకి దిగింది. నెగెటివ్ రాగానే క్వారంటైన్ అయిపోగానే షూటింగ్‌లతో బిజీగా అయిపోయింది.

Advertisement

rakul preet singh enjoys Lohri Celebration AT Mayday Set

అలా క్వారంటైన్‌లో ఉండి బరువు పెరిగానని ఫీలైనట్టుందో ఏమో గానీ ఇప్పుడు వర్కవుట్లు మరింత ఎక్కువగా చేస్తోంది. ఏకంగా టైం వేస్ట్ చేయడం ఎందుకని 12 కిలోమీటర్లు సైక్లింగ్ చేసుకుంటూ తాను బస చేసిన హోటల్ నుంచి మేడే సెట్ వరకు వెళ్లేస్తోంది. మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్‌ మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో నిన్న మేడే సినిమా షూటింగ్ సెట్‌లో యూనిట్ అంతా భోగి సెలెబ్రేషన్స్ నిర్వహించారు. దీంట్లో యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

Advertisement

మామూలుగా ఇలాంటి సెలెబ్రేషన్స్ నిర్వహించరేమో అని రకుల్ ప్రీత్ సింగ్‌ ఫీలైనట్టుంది. అలా సెట్‌లో చివరకు రాత్రి భోగి మంటలను ఏర్పాటు చేసి వేడుకలు జరపగా రకుల్ ఎగ్జైట్ అయింది. భోగీ మంటల చుట్టూ తిరుగుతూ యూనిట్ సభ్యులతో కలిసి రకుల్ ఎంజాయ్ చేసింది. ఇక అందరికీ భోగీ శుభాకాంక్షలు చెప్పింది. రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇప్పుడు వరుసబెట్టి అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా ఫుల్ బిజీగా ఉంటోంది. అన్నింటి కంటే ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లే రకుల్ ప్రీత్ సింగ్‌ ఖాతాలో ఉన్నాయి.

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి