Home » Entertainment » Rakul Preeth Singh Career Is Effected By Nagarjuna
Entertainment

Rakul preeth singh : రకుల్ నాగార్జునతో చేసే సగం కెరీర్ దెబ్బతింది..ఇప్పుడు బాలయ్యతో అంటే..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: July 5, 2021 9:01 am
Advertisement

Rakul preeth singh : రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ లో ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో అందరికీ తెలిసిందే. తనకున్న క్రేజ్ కారణంగా పెద్ద నిర్మాణ సంస్థలో సినిమాలనే వదులుకుంది. మహేష్ బాబు సినిమాకి డేట్స్ ఇవ్వలేనంత బిజీగా రకుల్ గడిపిన సందర్భాలున్నాయి. అయితే ఒక్కసారిగా టాలీవుడ్‌లో రకుల్ కెరీర్ డౌన్ ఫాల్ అయింది. సక్సెస్‌లు రాకపోతుండటంతో టాలీవుడ్ మేకర్స్ తనకి అవకాశాలివ్వడానికి ఆలోచించారు. దాంతో నాగార్జున నటించిన మన్మధుడు 2లో అవకాశం వస్తే ఇదేదో తన కెరీర్‌కి హెల్ప్ అవుతుందని భావించింది.

Advertisement

rakul-preeth-singh-career-is-effected-by-nagarjuna

కానీ ఇది పెద్ద మైనస్ అవుతుందని ఊహించలేదు. రకుల్ కెరీర్‌రో చేసిన పెద్దపొరపాటు రకుల్ నాగార్జున లాంటి సీనియర్ హీరోతో నటించడమే. ఈ సినిమా తర్వాత రకుల్ గురించి టాలీవుడ్ మేకర్స్ ఆలోచిస్తున్నవాళ్ళు చాలా తక్కువ. అయినా మరోసారి రకుల్ ఇదే రాంగ్ డెసిషన్ తీసుకుంటుందా..అంటే ప్రాజెక్ట్ ఓకే చేస్తే మాత్రం అవుననే అంటారు. నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా లైనప్ షాకిస్తోంది. యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

Advertisement

Rakul preeth singh : బాలయ్య సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ‘అఖండ’ సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత గోపిచంద్ మలినేనితో 107, అనిల్ రావిపూడితో 108వ సినిమాలను చేయనున్నాడు. అలాగే శ్రీవాస్ డైరెక్షన్‌లో సి.కళ్యాణ్ నిర్మాతగా ఒక సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇందులో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ని తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య సరసన అంటే రకుల్ ఒప్పుకుంటుందో లేదో తెలియదు గానీ, ప్రస్తుతం మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో బాలయ్య సినిమా చేస్తే ఇక రకుల్ యంగ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కదన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి