Ram Charan : ఇండియన్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఇందులో భాగం కావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పటి వరకూ జరిగిన ప్రమోషన్స్‌లో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. చివరి నిమిషంలో మీడియాతో ముచ్చటించిన విజయేంద్ర ప్రసాద్ తన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్నకు రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ ఎవరికీ తెలియని సీక్రెట్స్ రివీల్ చేశారు. రాజమౌళి మొదట మల్టీ స్టారర్ తీయాలని అనుకున్నారని, అయితే మొదట ఎవరినీ పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేశారట.
రజనీకాంత్-అర్జున్, సూర్య-కార్తీ వంటి స్టార్స్‌తో పాటు మరికొన్ని కాంబినేషన్‌లు అనుకున్నారు. అయితే సహజంగానే స్నేహంగా ఉండే స్టార్స్, రెండేళ్లపాటు ఒకరితో ఒకరు కలిసి ఉండే ఇద్దరు హీరోలు కావాలి. కాబట్టి రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక రామ్ చరణ్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్, పలు వేరియేషన్స్ ఉంటాయని చెప్పిన విజయేంద్ర ప్రసాద్ పాత్రల పరంగా రామ్ చరణ్‌కే రెండు మార్కులు ఎక్కువ ఇస్తానని అన్నాడు. దీంతో రామ్ చరణ్ అభిమానులు పండు చేసుకుంటున్నారు.
ఈ కథలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రాణ మిత్రులుగా కనిపిస్తారు కానీ వారి వారి ఐడియాలజీ వేరుగా ఉంటుందని చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు బయటపెట్టారు. సినిమా ఆరంభంలోనే ఇద్దరు హీరోలు ఉత్తర, దక్షిణ ధృవాలు అని, వేర్వేరు స్వభావాలున్న వ్యక్తులని అర్థమవుతుందని అన్నారు. అయితే ఆ స్టోరీ లోకి ఎంటర్ అయ్యాక వీళ్లిద్దరి మధ్య క్లాష్ రాకుండా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ తెప్పిస్తూ కథ సాగుతుందని చెప్పారు. సినిమా ఆరంభంలోనే ఇద్దరు హీరోలు ఉత్తర, దక్షిణ ధృవాలు అని, వేర్వేరు స్వభావాలున్న వ్యక్తులని అర్థమవుతుందని అన్నారు. అయితే ఆ స్టోరీ లోకి ఎంటర్ అయ్యాక వీళ్లిద్దరి మధ్య క్లాష్ రాకుండా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ తెప్పిస్తూ కథ సాగుతుందని చెప్పారు. హీరోల మధ్య జరిగే పోరాటం కన్నీళ్లు పెట్టిస్తుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.