Home » Entertainment » Ram Charan Upasana Twins Names Meanings Sivaram And Anveera Devi
Entertainment

Ram Charan Upasana Twins Names : రామ్ చరణ్ ఉపాసన పిల్లల ‘శివరాం’ , ‘అన్వీరా దేవి’.. పేర్లకు అర్ధాలు తెలుసా..?

Authored By
Admin
The Telugu News | Updated on: February 13, 2026 4:37 pm
Advertisement

Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ కవల పిల్లలకు ‘శివరామ్’  Sivaram  మరియు ‘అన్వీరా దేవి’ Anveera Devi అనే పేర్లను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మెగా కుటుంబంలోకి ఇద్దరు వారసులు ఒకేసారి రావడం, అందులోనూ వారికి ఎంతో అర్థవంతమైన పేర్లు పెట్టడం పట్ల మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా ఈ పేర్లను పెట్టడంలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారని, ఆయనే స్వయంగా ఈ పేర్లను సూచించారని తెలుస్తోంది. తన తండ్రి మీద ఉన్న గౌరవంతో పాటు, ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా ఉండాలని చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Ram Charan Upasana Twins Names : రామ్ చరణ్ ఉపాసన పిల్లల ‘శివరాం’ , ‘అన్వీరా దేవి’.. పేర్లకు అర్ధాలు తెలుసా..?

Ram Charan Upasana Twins Names : ఆ పేర్లకి అర్ధాలు ఏంటి :

ఈ పేర్ల వెనుక ఉన్న అర్థాలను గమనిస్తే, అవి ఎంతో లోతైనవిగా కనిపిస్తున్నాయి. ‘శివరామ్’ అనే పేరులో అటు శివుడు, ఇటు రాముడు ఇద్దరు దేవుళ్ల కలయిక కనిపిస్తుంది. శివుడు లయకారుడైతే, రాముడు ధర్మానికి నిలువుటద్దం. ఈ ఇద్దరి శక్తులు కలిసిన పేరుగా ‘శివరామ్’ను ఎంచుకున్నారు. అలాగే చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్ అందులో శివ ని , రాం చరణ్ లోని రాం ని తీస్కున్నట్టు తెలుస్తోంది. ఇక అమ్మాయికి పెట్టిన ‘అన్వీరా దేవి’ అనే పేరు కూడా చాలా ప్రత్యేకం. అన్వీరా అంటే ఎంతో ధైర్యవంతురాలు లేదా శక్తివంతురాలు అని అర్థం వస్తుంది. సమాజంలో ఎంతో ధైర్యంగా, స్వతంత్రంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేవి అనే పదం ఆ పేరుకు మరింత నిండుదనాన్ని, భక్తి భావాన్ని జోడించింది.

Advertisement

చిరంజీవికి తన కుటుంబం అన్నా, సంప్రదాయాలన్నా చాలా ఇష్టం. అందుకే తన మనవడు, మనవరాలికి ట్రెండీగా ఉండే పేర్ల కంటే, మన సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు ఉండాలని ఆయన పట్టుబట్టారట. రామ్ చరణ్, ఉపాసన కూడా చిరంజీవి నిర్ణయానికి వెంటనే ఓకే చెప్పేశారని టాక్. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ పిల్లలకు వెరైటీగా ఉండే పేర్లు పెట్టాలని చూస్తుంటారు, కానీ మెగా ఫ్యామిలీ మాత్రం ఇలాంటి క్లాసిక్ పేర్లను ఎంచుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి