Ram Charan : కొన్ని సినిమాలు అనూహ్యంగా ఫ్లాపవుతుంటాయి. ఆ దెబ్బకి అదే దర్శకుడితో సినిమా కమిటైన హీరో నమ్మకం కుదరక హిట్ ఇస్తాడో లేదో అని సందేహాలు మొదలై సున్నితంగా ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్మ్ చరణ్ కూడా అదే చేసినట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. తనతో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. గత ఏడాది ఎప్పుడో అనౌన్స్ అయింది. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందనుంది అంటూ వార్తలు వచ్చాయి.
అంతేకాదు సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలవబోతుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేస్తున్డడంతో.. గౌతమ్, జీర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి వెళ్ళిపోయాడు. షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ సినిమాని హిందీలో రూపొందించాడు. ఇటీవలే ఈ సినిమా రిలీజై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.మన తెలుగు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన సినిమాకి బాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ కాలేక పోయారు. పైగా స్లో నేరేషన్, మరీ క్రికెట్ ఆట సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు చేశారు.
ఈ ఎఫెక్ట్ హిందీ జెర్సీ వసూళ్లుపై ప్రభావం చూపించి… ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశ పర్చాయి. గౌతం పాన్ ఇండియా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో గౌతమ్ రీజనల్ సినిమాలు చేయడమే బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనవసరంగా హిందీ జెర్సీ చేసి ఫ్లాప్ నెత్తిమీద పెట్టుకున్నాడని అంటున్నారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ గౌతం తీన్ననూరి – రామ్ చరణ్ కాంబో సినిమాపై
గట్టిగా పడింది. ఇది కూడా స్పోర్ట్స్ జోనర్ కాబట్టి చెర్రీ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నాడట. అందుకే, నో చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమో కాదో చూడాలి.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.