Home » News » Smartphones With The Latest Features And Best Specifications
News

Smart Phones : లెటెస్ట్ ఫీచ‌ర్స్, బెస్ట్ స్పెసిఫికేష‌న్స్ తో స్మార్ట్ ఫోన్లు.. అమెజాన్ లో భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్లు..

Authored By
mallesh
The Telugu News | Published on: June 3, 2022, 2:30 pm
Advertisement

Smart Phones : లేటెస్ట్ ఫీచ‌ర్లు, బెస్ట్ స్పెసిఫికేష‌న్ల‌తో అమెజాన్ లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ల‌ను ప్ర‌స్తుతం బెస్ట్ ఆఫ‌ర్ల‌తో కొనుగోలు చేయ‌వ‌చ్చు. అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 5జీ స‌పోర్ట్ తో ఈ ఫోన్స్ ప‌నిచేయ‌నున్నాయి. 30 వేల లోపు ప‌లు బ్రాండ్ల‌ కంపెనీల ఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం… శాంసంగ్ గెలాక్సీ ఏ52 ఎస్ స్మార్ట్ ఫోన్ 5జీ స‌పోర్ట్‌తో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్,128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ల‌భిస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. తెలుపు రంగులో చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో ఫ్లాష్‌లైట్ ఫీచ‌ర్ కూడా ఉంది. దీని ధ‌ర 40,999 కాగా 15% ఆఫ‌ర్ తో రూ. 34,999 కే వ‌స్తుంది. దీంతో రూ.6000 ఆదా చేసుకోవ‌చ్చు.

Advertisement

అలాగే ఐ క్యూ నియో 6 5G స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ గా లాంచ్ చేయ‌బ‌డింది. ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 870 5జీ హై స్పీడ్ ప్రాసెసర్ ఉంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను భారీ త‌గ్గింపుతో కొనుగోలు చేయ‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో ఇది ఎక్చంజ్ ఆఫ‌ర్‌లో ల‌భిస్తుంది. ధ‌ర రూ. 34999 కాగా 14% ఆఫ‌ర్తో రూ.29,999 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్ పై నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. అలాగే రెడ్ మీ నోట్ 11ప్రో స్మార్ట్ ఫోన్ స్లిమ్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. 6.67 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఫీచ‌ర్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌ 120 ఎచ్ జ‌డ్ రీ ఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఇది 108 ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరాతో ల‌భిస్తోంది. ఈ ఫోన్ లో ఇన్-బిల్ట్ అలెక్సా ఫీచర్ కూడా ఉంది. కాగా అమెజాన్ లో ధ‌ర రూ.28,999 ఉండ‌గా 14% ఆఫ‌ర్ తో రూ.24,999 కి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Smartphones with the latest features and best specifications

Advertisement

ఎక్స్ చేంజ్ ఆఫ‌ర్ కూడా ఉంది. ఇక వ‌న్ ప్ల‌స్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం బడ్జెట్ ధ‌ర‌లో ల‌భిస్తుంది. ఈ వ‌న్ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ తో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా ద్వారా 4 కే వీడియోలను కూడా షూట్ చేసేలా ఉంది. అమెజాన్ ఈ ఫోన్ ధ‌ర రూ.29,999 గా ఉంది. అలాగే ఎక్స్ చేంజ్ ఆఫ‌ర్ కూడా అందుబాటులో ఉంది. ఒప్పో ఎఫ్ 21 ప్రో ట్రెండింగ్ లో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో మీకు రింగ్ లైట్ ఇవ్వబడింది . ఇది ఫ్లాష్‌తో పాటు నోటిఫికేషన్ అలర్ట్‌గా పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్ తో 128 జీబీ స్టోరేజ్ ల‌భిస్తోంది. కాగా అమెజాన్ లో దీని ధ‌ర రూ.27,999 గా ఉండగా ఆఫ‌ర్ తో రూ.22,999 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి