Home » Entertainment » Ram Gopal Varma Comments About Chiranjeevi
Entertainment

Ram Gopal Varma : నువ్వు కూడా ఇలాంటి వాడివి అనుకోలేదు .. చిరంజీవిపై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్ ..!

Authored By
aruna
The Telugu News | Published on: August 11, 2023, 4:00 pm
Advertisement

Ram Gopal Varma : సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన సినిమాలు చేయడం, ముక్కుసూటిగా మాట్లాడడం ఆర్జీవి లో ఉన్న లక్షణాలు. ఈ కారణంగానే ఏమో ఈయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఆర్జీవి మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవికి ఆర్జీవికి ఎక్కడ చెడిందో కానీ ఆ డైరెక్టర్ మాత్రం ఎప్పుడు చిరంజీవిపై కన్నేసి ఉంచుతూనే ఉంటారు.

Advertisement

చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వర్మ కి వచ్చింది. సినిమాను కొంత షూటింగ్ కూడా చేశారు. మధ్యలో బాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేసేందుకు వర్మ వెళ్లడంతో చిరంజీవి ప్రాజెక్ట్ పక్కన పడిపోయింది. అలా చిరు , వర్మల ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ కోపం ఇంకా ఉందో ఏమో కానీ చిరు మాత్రం ఆర్జీవి వ్యాఖ్యలు పట్టించుకోరు. మొన్న ‘ భోళాశంకర్ ‘ మూవీ ఈవెంట్లో హైపర్ ఆది మాట్లాడినప్పుడు సినీ రాజకీయ వర్గాలకు దారితీసాయి. మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేసే వారందరికీ గట్టిగా కౌంటర్ లు వేసాడు. వర్మపై కూడా సెటైర్లు వేశాడు.

Ram Gopal Varma comments about chiranjeevi

Advertisement

చిరంజీవి , పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి రామ్ గోపాల్ వర్మకి లేదని పరోక్షంగా స్టేజిపై హైపర్ ఆది అన్నాడు. అయితే ఆ స్పీచ్ కి ఆర్జీవి ఏమైనా హర్ట్ అయ్యాడో ఏమో తెలియదు కానీ తాజాగా వర్మ వేసిన ట్వీట్ ను అభిమానులకు కోపం తెప్పించేలా ఉంది. చిరు కీర్తి సురేష్ పై చేసిన చిలిపి చేష్టల వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు ఆర్జీవి. సోషల్ మీడియాలో చిరంజీవి కీర్తి సురేష్ పై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఆ ట్రోలింగ్ వీడియోను వర్మ షేర్ చేశాడు. అయితే వర్మ ఇలాంటి ట్రోలింగ్ అసలు పట్టించుకోడని అందరికీ తెలిసిందే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి