Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్రియేట్ చేసే సెన్సేషన్స్ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి. వర్మకి మెగా ఫ్యామిలీ అంటే ఆసక్తి చాలా ఉంటుంది. ఈ మధ్య అల్లు అర్జున్ తో పాటు పుష్ప సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. ఉన్నట్టుండి బన్నీని ఆకాశానికి ఎత్తేశాడు. పుష్ప సినిమాను ప్రస్తావిస్తూ.. ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్ళావంటూ తెగ పొగిడేశాడు. వర్మ ట్వీట్ చేస్తూ.. హే అల్లు అర్జున్ .. అంతిమ్,సత్యమేవ జయతే 2, 83 లాంటి సినిమాలు ఉన్నప్పటికీ.. వాటన్నింటిని వెనక్కి నెట్టి.. తెలుగు సినిమాను.. ఒక రీజనల్ సినిమా పుష్ప ను జాతీయ స్థాయిలో నిలబెట్టావ్..
ఈ క్రెడిట్ అంతా నీదే కుదోస్ అంటూ.. బన్నీ పై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ.ఇక తాజాగా ఆచార్య సినిమా విషయంలో మరోసారి అల్లు అర్జున్‌ని ఆకాశానికి ఎత్తాడు. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య సినిమాలోని ‘భలే భలే బంజారా’ సాంగ్ విడుదల తేదిని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో చూసి నిర్మొహమాటంగా తన మనసులో మాట బయటపెట్టారు వర్మ. మరోసారి అల్లు అర్జున్ టాపిక్ తీస్తూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆచార్య నుంచి విడుదల చేసిన ఆ వీడియోలో ‘నువ్వు నన్ను డామినేట్ చేస్తావా
‘ అంటూ చిరంజీవి- రామ్ చరణ్ మధ్య నడిచిన సంభాషణ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.దీంతో ఇదే వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ.. ”తగ్గను తగ్గను.. అంటూ అల్లు అర్జున్ తగ్గదేలే డైలాగ్స్‌తో మెగా ఫాదర్, మెగా సన్ అనుకుంటూ ఉండటం చూసి నేను మెగా హర్ట్ అయ్యాను. ఇక్కడ బన్నీ డైలాగులు వాడటం చూస్తుంటే న్యూ మెగా హీరో అల్లు
అర్జునే అని రామ్ చరణ్, చిరంజీవి రుజువు చేసినట్లు ఉంది” అని పేర్కొన్నారు. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకేముంది నెటిజన్ల నడుమ ఫ్యాన్ వార్ ముదిరింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.