Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలుఅక్కర్లేదు. ఆయన ఏం మాట్లాడిన, ఏం చేసిన కూడా హాట్ టాపిక్ అవుతుంది. అయితే వర్మ తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు.కాని ఇప్పుడు మాత్రం ఆయన ఏ సినిమా చేసిన అది అట్టర్‌ఫ్లాప్ అవుతుంది. కాంట్రవర్షియల్ కామెంట్స్, వివాదాస్పద పనులతో ఎప్పుడు వార్తలలో నిలుస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే గొప్ప టెక్నీషియన్‌గా పేరు తెచ్చుకున్న వర్మ ఇటీవలి కాలంలో ఆ పేరుని చెడగొట్టుకోవడం మనం చూశాం. అయితే ఇప్పుడు ఆయన రూట్ మార్చారు. ‘యువర్ ఫిల్మ్స పేరుతో ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆయన లాంచ్ చేశారు. మెజారిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఎంచుకున్నట్లు తమకు నచ్చే సినిమాను ఆడియన్స్ లైక్స్ ఆదారంగా డెమోక్రటిక్ విధానంలో చేయబోతున్నారు రామ్ గోపాల్ వర్మ.
రీసెంట్‌గా విలేకర్లతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఏ సపోర్ట్ లేని ప్రతిభావంతులను ఎంకరేజ్ చేయాలన్నదే మా ఆలోచన. సినిమాకు సంబందించిన అన్నీ విభాగాల్లోనూ ది బెస్ట్ టాలెంట్ ఆడియన్స్ ద్వారానే గుర్తించి, వారితోనే సినిమాలు తీస్తాం. క్రౌడ్ ఫండెడ్ ఆలోచన కూడా నాకు ఉంది అని చెప్పుకొచ్చారు వర్మ. స్టార్ హీరోల ఇమేజ్ తగ్గ సినిమాలు చేయలేను. గతంలో కూడా ఈ విషయం చెప్పాను. నాకు ఆ కెపాసిటీ లేదు. నేను ఎప్పుడు రియలిస్టిక్, డార్క్ జానర్ సినిమాలు చేశాను. జోనర్ బెస్ట్ సినిమాలనే చేశాను అని వర్మ చెప్పుకొచ్చారు.
అయితే ఓ విలేకరి సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు సడెన్‌గా ప్రేమ వచ్చింది అని అడగగా, అందుకు వర్మ స్పందిస్తూ.. ప్రేమ కాదు బుద్ది వచ్చింది అని చెబుతాడు. వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా రీల్స్ చేస్తూ పాపులర్ అవుతున్న కొందరు ముద్దుగుమ్మలను తన అడల్డ్ ఫిల్మ్స్ కోసం సెలక్ట్ చేసుకొని వారిని స్టార్లుగా మార్చుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈ విషయంపై ఆర్జీవీ స్పందించారు. అది కామన్‌గా జరుగుతున్న విషయమే కదా అని ఆయన స్పష్టం చేశారు. అయితే వర్మ రానున్న రోజులలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.